కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో దేశంలోనే టాప్ 20 గ్రామాల్లో 19 గ్రామాలు తెలంగాణవే – మంత్రి కేటీఆర్

Minister KTR Participates Virtually The Inaugural Event of International Youth Kindness Conference, Telangana Minister KTR Participates Virtually The Inaugural Event of International Youth Kindness Conference, KTR Participates Virtually The Inaugural Event of International Youth Kindness Conference, Inaugural Event of International Youth Kindness Conference, International Youth Kindness Conference, World Youth Conference on Kindness, Telangana Minister KTR, World Youth Conference for Kindness held, International Youth Kindness Conference News, International Youth Kindness Conference Latest News, International Youth Kindness Conference Latest Updates, International Youth Kindness Conference Live Updates, Mango News, Mango News Telugu,

ఇటీవల కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో దేశంలోనే టాప్ 20 గ్రామాల్లో 19 గ్రామాలు తెలంగాణకు చెందిన గ్రామాలు ఉన్నాయని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూర్‌లోని కన్హా శాంతి వనంలో జరుగుతున్న అంతర్జాతీయ యువజన సదస్సులో వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ముందు వరుసలో ఉందని అన్నారు. ఐటీ రంగంలో గణనీయంగా వృద్ధి సాధిస్తున్నామని, అలాగే టీఎస్ఐఐసీతో పారిశ్రామిక రంగంలో నవశకం మొదలైందని చెప్పిన మంత్రి రాష్ట్రంలో స్టార్తప్ కంపెనీలను ప్రోత్సాహించేలా 15 రోజుల్లోగా పరిశ్రమలకు అనుమతులిస్తున్నామని గుర్తు చేశారు.

ఇక గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధిలో కూడా తెలంగాణ అసాధారణ ప్రగతిని సాధిస్తోందని స్పష్టం చేసిన మంత్రి కేటీఆర్.. దీనికి ఉదాహరణగా ఇటీవల కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో దేశంలోనే టాప్ 20 గ్రామాల్లో 19 గ్రామాలు తెలంగాణకు చెందిన గ్రామాలు ఉన్నాయని చెప్పారు. అలాగే స్వచ్ఛ సర్వేక్షన్‌లో సైతం రాష్ట్రంలోని 12 మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వ అవార్డులు దక్కాయని ఆయన వెల్లడించారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో దాదాపు 10 శాతం నిధులను గ్రీన్ బడ్జెట్‌కు కేటాయిస్తున్నామని చెప్పిన కేటీఆర్ ఈ ఎనిమిదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 240 కోట్ల మొక్కలు నాటామని తెలిపారు. అన్నింటికన్నా ముఖ్యంగా కోవిడ్-19 వైరస్‌కు వ్యాక్సిన్‌ను తెలంగాణ నుంచే దేశానికి అందించామని ప్రకటించిన మంత్రి కేటీఆర్ అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + two =