విద్య నైతిక విలువలు, సామాజిక బాధ్యత నేర్పే విధంగా ఉండాలి: మంత్రి హరీశ్ రావు

Finance Minister Harish Rao, Finance Minister Harish Rao News, Harish Rao Speech at Lions Club, Harish Rao Speech at Lions Club Adopt Schools Programme, Lions Club, Lions Club Adopt Schools, Lions Club Adopt Schools Programme, Mango News Telugu, Minister Harish Rao, Minister Harish Rao Speech at Lions Club, Telangana Finance Minister Harish Rao, TRS Harish Rao

ప్రభుత్వ పాఠశాల టీచర్లకు ఆన్‌లైన్‌లో‌ బోధనా పద్ధతులపై లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లోని వారి ఆడిటోరియంలో పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పాల్గొని, ఉత్తమ నైపుణ్యం కనబర్చిన టీచర్లకు ధృవీకరణ పత్రాల అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, కరోనా లాంటి పరిస్థితుల వల్ల విద్యతో పాటు అనేక రంగాల్లో మార్పులు వచ్చాయని అన్నారు. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వ పాఠశాల టీచర్లు ఆన్‌లైన్ లో పాఠాలు‌ చెప్పడం ఓ ఛాలెంజ్. ప్రైవేటు విద్యార్థులకు ఫోన్లపై కొంత అవగాహన ఉండొచ్చు. కాని పేద విద్యార్థులకు ఆన్‌లైన్ విధానంలో నేర్చుకోవడం కత్తి మీద సాము లాంటిదే. టీచర్లు కూడా ఇప్పుడు‌ విద్యార్థులుగా మారి నేర్చుకుని, విద్యార్థులకు నేర్పుతున్నారు. దీని వల్ల దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మితమవుతోందని అన్నారు.

విద్య నైతిక విలువలు, సామాజిక బాధ్యత నేర్పే విధంగా ఉండాలి:

“విద్య నేర్పే టీచర్లు కీలకమైన వ్యక్తులు. విద్య ఉద్యోగం కోసం కాదు. విలువలు, సామాజిక సృహ , రాజ్యాంగం పట్ల విదేయత నేర్పేదే విద్య. కానీ కార్పొరేట్ సంస్థల‌ వల్ల చదువుకోవాలి, అమెరికా వెళ్లి ఉద్యోగం చేయాలని తప్ప సామాజిక‌ విలువలు ఉండటం లేదు. విద్య నైతిక విలువలు, సామాజిక బాధ్యత నేర్పే విధంగా విద్య ఉండాలి. చెత్త వేస్తే అది మున్సిపాలిటీదే బాధ్యత అనేలా భావిస్తున్నారు. కానీ ఇది‌ మన బాధ్యత అనేలా విద్య‌సాగాలి. కుటుంబ వ్యవస్థపై గౌరవం కలిగేలా చూడాలి. ఆన్‌లైన్ పోటీలో తమ ఉత్తమ బోదనా నైపుణ్యం కనబర్చిన టీచర్లకు అభినందనలు. ప్రభుత్వ టీచర్లు పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించేలా ‌చూడాలి. స్కూల్స్ ప్రారంభమైనా ఈ ఆన్‌లైన్ బోధనా పద్ధతిని కొనసాగించండి” మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =