మస్కట్‌ నుంచి హైదరాబాద్‌కు విమానాలు నడపాలని కేంద్రమంత్రికి కేటిఆర్ విజ్ఞప్తి

Flights from Muscat to Hyderabad, Hyderabad, KTR, KTR Latest News, KTR Requests Flights from Muscat to Hyderabad, KTR Requests Muscat to Hyderabad Flights, Minister KTR, Minister KTR Requests Civil Aviation Minister, Minister KTR Requests Flights from Muscat to Hyderabad, Muscat, Muscat to Hyderabad, Muscat to Hyderabad Flights, telangana

మస్కట్‌లో ఉన్న తెలంగాణకు చెందిన పలువురు వ్యక్తులు చేసిన అభ్యర్థనపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ స్పందించారు. కరోనా మహమ్మారి కారణంగా జీతాలు, ఆహారం లేక మస్కట్ లో ఇబ్బందులు పడుతున్న కార్మికుల కోసం మస్కట్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చేలా విమానాలను ఏర్పాటు చేయాలని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి మంత్రి కేటిఆర్ విజ్ఞప్తి చేశారు.

ముందుగా మూడు నెలలుగా మస్కట్ లో పని, ఆహారం, జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కరీంనగర్ కు చెందిన శ్రీనివాస్‌ అనే కార్మికుడు వీడియో ద్వారా ట్విట్టర్ మాధ్యమంలో మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకొచ్చారు. మస్కట్‌ నుంచి విమానాలను కేరళ రాష్ట్రానికే నడుపుతున్నారని, తాము రాష్ట్రానికి వచ్చేలా ఏర్పాట్లు చేయాల్సిందిగా మంత్రి కేటిఆర్ ను కోరారు. ఈ నేపథ్యంలో మస్కట్‌ నుంచి హైదరాబాద్‌కు కూడా విమానాలు నడపాలని కేంద్రమంత్రికి కేటిఆర్ విజ్ఞప్తి చేశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 14 =