నేటి నుంచే 3-4 లక్షల కుటుంబాలకు 10,000 వేలు ఆర్థిక సహాయం: మంత్రి కేటిఆర్

10000 Compensation For Flood Affected Families, CM KCR, Compensation For Flood Affected Families, Compensation For Flood Affected Families In Hyderabad, Heavy Rains In Hyderabad, Hyderabad Rains, Hyderabad Rains news, Minister KTR, Minister KTR Says Govt will Provide Financial Assistance, Rains In Hyderabad, telangana, Telangana rains, telangana rains news, telangana rains updates

హైదరాబాద్ నగరంలో వరదనీటి ప్రభావానికి గురైన ప్రతీ ఇంటికి రూ.10 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందించనున్నట్టు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ మరియు ప్రక్కనే ఉన్న ప్రభావిత ప్రాంతాల్లో ఈరోజు(మంగళవారం) నుండి 3-4 లక్షల కుటుంబాలకు మునిసిపల్ శాఖ ఆధ్వర్యంలో వారి ఇంటి వద్దనే ₹10,000 ఆర్థిక సహాయం అందిస్తామని రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి కేటిఆర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. వర్షాలు, వరద బాధిత పేదలకు సాయం అందించేందుకు ఆర్థిక శాఖ రూ.550 కోట్లను మున్సిపల్ శాఖకు విడుదల చేసిందని, అవసరమైతే ఇంకా సహాయం అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారని మంత్రి కేటిఆర్ అన్నారు.

ప్రతి బాధిత ప్రతి కుటుంబానికి/వ్యక్తికి ఉపశమనం లభించాలని సీఎం కేసీఆర్ సూచించారని మంత్రి తెలిపారు. ఈ సంక్షోభం సమయంలో, ఎమ్మెల్యేలు, కార్పోరేటర్లు, ఆర్‌డబ్ల్యుఎలు, ఎన్జిఓలు మరియు ఇతర ప్రజా ప్రతినిధులకు అందరూ ముందుకు వచ్చి ముంపు బాధితులకు అండగా నిలిచి, అందరికి సహాయం అందేలా చూడాలని మంత్రి కేటిఆర్ విజ్ఞప్తి చేశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =