కేసీఆరే లేకపోతే తెలంగాణ వచ్చేనా? ప్రతిపక్షాలకు చెందిన ఇద్దరికి పార్టీ అధ్యక్ష పదవులు వచ్చేనా? – మంత్రి కేటీఆర్‌

Minister KTR Slams TPCC Chief Revanth Reddy and BJP State President Bandi Sanjay, Minister KTR Slams TPCC Chief Revanth Reddy, KTR Slams BJP State President Bandi Sanjay, KTR Slams Revanth Reddy and Bandi Sanjay, Mango News, Mango News Telugu, Minister Ktr Office Address,Honorable Minister Ktr,Ktr Personal Secretary Name,Ktr Phone Number,Ktr Son,Ktr Wife,Minister Ktr,Minister Ktr Phone Number,Minister Ktr Tweet,Minister Ktr Twitter,Telangana Minister Ktr,Telangana Minister Ktr Phone Number,Telangana Minister Ktr Tweet,Trs Minister Ktr

కేసీఆరే లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేనా? ప్రతిపక్షాలకు చెందిన ఆ ఇద్దరు నాయకులకు పార్టీ అధ్యక్ష పదవులు వచ్చేనా? అని ప్రశ్నించారు బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌. గురువారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూపాలపల్లి అంబేడ్కర్‌ మైదానంలో జరిగిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. నాడు ఉద్యమ సమయంలో కేసీఆర్ చావు అంచులదాకా వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, అలాగే తన దార్శనిక పాలనతో రాష్ట్రాన్ని నేడు దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపారని పేర్కొన్నారు. అయితే ప్రతిపక్షాల పార్టీల నేతలు మాత్రం సీఎం కేసీఆర్ పైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఒకరేమో ప్రగతి భవన్‌ను పేల్చాస్తా అని అంటున్నారని, మరొకరేమో సెక్రటేరియట్‌ను పేల్చేస్తామని వ్యాఖ్యలు చేస్తున్నారని, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరియు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లను ఉద్దేశించి అన్నారు.

పచ్చగా ఉన్న తెలంగాణను పిచ్చోళ్ల చేతుల్లో పెట్టొద్దని, ఇలాంటోళ్ల చేతుల్లో ప్రజాస్వామ్యంలో పార్టీలు పనిచేస్తే రాష్ట్రం మొత్తానికి ఇబ్బంది అవుతుందని, అలోచించి నాయకులను ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు. కేసీఆర్ అనేవాడు లేకపోతే, తెలంగాణ రాష్ట్ర సమితి లేకుంటే, అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చేనా? 2001లో కేసీఆర్ గులాబీ జెండా చేతబట్టి బయలుదేరకపోతే రాష్ట్రం సిద్దించేనా? అని ప్రశ్నించారు. అలాగే తెలంగాణనే రాకపోతే ప్రతిపక్షాలకు చెందిన ఆ ఇద్దరు నాయకులకు పార్టీ అధ్యక్ష పదవులు వచ్చేనా? వీళ్లకు తెలంగాణ కాంగ్రెస్‌, తెలంగాణ బీజేపీ అని పార్టీల పేర్లు వచ్చెడివా? అని మంత్రి ప్రశ్నించారు. అధికారం రావాలంటే ఇప్పటిదాకా ఏం చేశామో చెప్పాలని, అలాగే వస్తే ఏం చేయగలమో కూడా చెప్పగలగాలని తెలిపిన మంత్రి కేటీఆర్.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఆ విధానమే లేదని, అడ్డదారిలో అధికారంలోకి రావడానికి ప్రజలను మభ్యపెట్టే మాటలు చెబుతున్నారని మండిపడ్డారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 5 =