డా. బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది – రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ తమిళి సై

Telangana Governor Tamilisai Soundararajan Unfurls The National Flag at Raj Bhavan on Eve of Republic Day,Telangana Governor Tamilisai Soundararajan,Tamilisai Soundararajan Unfurls Flag,National Flag at Raj Bhavan,Republic Day,Mango News,Mango News Telugu,Republic Day,Decision on Republic Day Celebrations,Telangana Government's Decision,Republic Day Celebrations,Will Be Taken Into Consideration By The Central,Governor Tamilisai,Republic Day In India,Republic Day In Telangana,India Republic Day 2023,First Republic Day Of India,Republic Day Celebration In Hyderabad,Republic Day Events In Hyderabad,Republic Day Celebrations In India

హైదరాబాద్ లోని రాజ్‌భవన్‌లో గురువారం రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకావిష్కరణ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం తరుపున సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అలాగే సినీ ప్రరిశ్రమ నుంచి ప్రముఖ సంగీత దర్శకుడు, గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి తన సతీమణితో కలిసి పాల్గొనగా, ఇటీవల ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటను రచించిన చంద్రబోస్ కూడా హాజరయ్యారు.

ఇక ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తూ.. భారత రాజ్యాంగ రూపకర్త డా. బాబా సాహెబ్ బీమ్ రావ్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు. దేశం మొత్తం గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటోందని, జాతి మొత్తం నేడు ఐక్యతా స్ఫూర్తిని ప్రదర్శిస్తోందని తెలిపారు. అయితే మన రాష్ట్రంలో మాత్రం అధికారికంగా జరుపకపోవడం కొంత బాధ కలిగిస్తోందని చెప్పిన ఆమె ప్రభుత్వ తీరుపై కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం భారతదేశం సొంతమని, ఈ రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఎంతోమంది మేథావుల, మహోన్నత వ్యక్తుల కృషి ఉందని గుర్తుచేశారు. తనకు తెలంగాణతో మూడేళ్ళ నుంచే కాదని, పుట్టుకతోనే అనుబంధం ఉందిని తెలిపారు. కొంతమంది తనను వ్యతిరేస్తున్నా, తనకు తెలంగాణ ప్రజలంటే ఇష్టం అని, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని వ్యాఖ్యానించారు.

ఇంకా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. అభివృద్ధి అంటే.. కొత్త భవనాల నిర్మాణం కాదని, మన పిల్లలు విదేశాల్లో చదవడం కాదని పేర్కొన్న గవర్నర్.. రాష్ట్ర విద్యాలయాలలో అంతర్జాతీయ ఫెసిలిటి ఏర్పాటు చేయగలగడం, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం అని తెలిపారు. తెలంగాణ గౌరవాన్ని నిలపెడుదామని, రాజ్యాంగాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ఎంతో ఘనచరిత్ర కలిగిన మన రాజధాని నగరం హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, దినదినాభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఇక తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి రాజ్‌భవన్‌ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, రాష్ట్రంలోని మారుమూల అటవీ, గిరిజన ప్రాంతాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − seventeen =