తెలంగాణలో పవన్ సభలకు ఊహించని రెస్పాన్స్..

Unexpected response to Pawan Sabhas in Telangana,Unexpected response to Pawan,Pawan Sabhas in Telangana,response to Pawan Sabhas,Pawan Sabhas in Telangana, Pawan, Major parties, Pawan craze,meetings, votes,Telangana Assembly Elections 2023,assembly seat, BJP,BRS, Congress,Mango News,Mango News Telugu,BJPs Telangana third list dominated,Saddened to see plight of Telangana,Pawan Kalyan Reaction,Pawan Sabhas in Telangana Latest News,Telangana Politics, Telangana Political News And Updates,Telangana Election Latest Updates
Pawan Sabhas in Telangana, Pawan, Major parties, Pawan craze,meetings, votes,Telangana Assembly Elections 2023,assembly seat, BJP,BRS, Congress,

తెలంగాణాలో ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంటోంది. ఇంకా మూడు రోజుల్లోనే తెలంగాణ పోలింగ్ మొదలవుతుండటంటో. పార్టీలన్నీ ప్రచారంలో చాలా బిజీగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ తెలంగాణాలోనే మకాం వేశారు. ఈలోపే పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. బీఆర్ఎస్ పార్టీ తరుపున సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు అన్నీ తామై ప్రచారం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ తరుపున రేవంత్ రెడ్డి సుడిగాలిలా తిరుగుతున్నారు. బీజేపీ-జనసేన కలిసి కట్టుగా పోటీ చేస్తున్నాయి కనుక పవన్ కళ్యాన్ ప్రచారం బాధ్యతను తీసుకున్నారు. గత వారం రోజులుగా ఆయన తెలంగాణలో సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. మొదట్లో ఇతర రాజకీయ పార్టీలు పవన్ కళ్యాణ్ ను తక్కువగా అంచనా వేశాయి. కానీ ఆయన కొన్ని ప్రాంతాల్లో నిర్వహించిన రోడ్ షోలకు, ప్రచారానికి జనం నుంచి స్పందన తీవ్రంగా వచ్చింది. దీంతో ఇతర రాజకీయ పార్టీలు కాస్త కలవరపడుతున్నాయి.

వరంగల్ లోని ఉర్సు గుట్ట దగ్గర పవన్ నిర్వహించిన బహిరంగ సభకు జనం బాగానే వచ్చారు. కొత్తగూడెం, సూర్యాపేట,  దుబ్బాక… ఇలా ప్రతి చోటా ఆయన నిర్వహించిన సభలకు జనం నుంచి స్పందన ఎక్కువగానే ఉంది. మొన్నటి వరకు బీజేపీ – జనసేన పొత్తును పెద్దగా పట్టించుకోలేదు ప్రధాన పార్టీలు. కానీ ఇప్పుడు పవన్ సభలకు భారీగా జనం తరలి వస్తుండడంతో షాక్ అవుతున్నాయి. పవన్ ప్రచారానికి ఇంతమంది ప్రజలు వస్తారని జనసేనతో పొత్తు పెట్టుకున్న బీజేపీ కూడా ఊహించి ఉండదు. అందుకే వారు కూడా ఆనందంలో తేలియాడుతున్నట్టు తెలుస్తోంది. జనం, రోడ్ షోలకు వచ్చిన ప్రజల ఓట్లు పడినా చాలు బీజేపీ- జనసేన అభ్యర్ధులు కచ్చితంగా కొన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది. లేదా ప్రధాన పార్టీల అభ్యర్థులకు గట్టి పోటీ అయినా ఇస్తారు.

మరోవైపు పవన్ కళ్యాణ్ సినిమా స్టార్. కాబట్టి ఆయన సభలకు వచ్చిన జనం అతడిని ఓ హీరోగా చూడటానికి వచ్చారో, లేక రాజకీయ నేతగా చూశారో మాత్రం తెలియదన్న వాదన వినిపిస్తోంది. హీరో కాబట్టి చూడటానికి వచ్చుంటే ఓట్లు రాలే అవకాశం తక్కువే. ఆయనలో ఓ రాజకీయ నాయకుడిని కూడా చూస్తే వారి అభిమానం ఓట్లు రాలే అవకాశం ఉంది. కూకట్‌పల్లిలో జనసేన అభ్యర్థిని నిలబెట్టారు. అక్కడ చేసిన ప్రచారానికి భారీగా జనం తరలివచ్చారు. అందిన సమాచారం మేరకు టీడీపీ కార్యకర్తలు ఈ సభలో పాల్గొన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన… ఇలా మూడు పార్టీల కార్యకర్తలు, అభిమానులతో ప్రచారం హిట్ కొట్టింది. భారీగా జనం రావడంతో కాస్త తోపులాట జరిగింది. ఇలా పవన్ సభల్లో తోపులాట జరిగేంతగా జనం రావడం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో కలవరం మొదలయింది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =