కొడంగ‌ల్, కోస్గిలోని ప్రభుత్వ ఆస్ప‌త్రుల అభివృద్ధిపై సీఎం కేసీఆర్, మినిస్టర్ హ‌రీష్ రావులకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన మంత్రి కేటీఆర్

Minister KTR Special Thanks To CM KCR and Harish Rao on Development of Kodangal and Kosgi Hospitals, Telangana Minister KTR Special Thanks To CM KCR and Harish Rao on Development of Kodangal and Kosgi Hospitals, KTR Special Thanks To CM KCR and Harish Rao on Development of Kodangal and Kosgi Hospitals, Development of Kodangal and Kosgi Hospitals, Telangana Minister KTR Special Thanks To Harish Rao on Development of Kodangal and Kosgi Hospitals, Minister KTR Special Thanks To CM KCR on Development of Kodangal and Kosgi Hospitals, Telangana Finance Minister Harish Rao, Telangana Minister Harish Rao, Finance Minister Harish Rao, Minister Harish Rao, Telangana Finance Minister, Harish Rao, Telangana Minister KTR, Minister KTR, Telangana CM KCR, CM KCR, Kodangal and Kosgi Hospitals, Kodangal and Kosgi Hospitals Development News, Kodangal and Kosgi Hospitals Development Latest News, Kodangal and Kosgi Hospitals Development Latest Updates, Kodangal and Kosgi Hospitals Development Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హ‌రీష్ రావులకు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ మేరకు ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌ న‌గ‌ర్ జిల్లా పరిధిలోని కొడంగ‌ల్ మరియు కోస్గి ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్, మినిస్టర్ హ‌రీష్ రావులను అభినందించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీష్ రావు చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ కేటీఆర్ ప్రత్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలియజేశారు.

కాగా మంత్రి హ‌రీష్ రావు ఈ ఆస్పత్రుల్లోని అభివృద్ధిని తెలియజేస్తూ ట్విట్టర్ ద్వారా కొన్ని పోస్టులు పెట్టారు. దీనిలో కొడంగ‌ల్ సివిల్ ఆస్పత్రిలో పడకల సంఖ్య 50 బెడ్ల‌కు పెంచామని, సీఎం కేసీఆర్ సూచనల మేరకు స్థానిక క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్ల‌లో ఐసీయూ, ఆప‌రేష‌న్ థియేట‌ర్, ఎక్స్-రే, అల్ట్రా సౌండ్‌ వంటి సదుపాయాలు క‌ల్పించామ‌ని పేర్కొన్నారు. అలాగే మరో రూ. 5 కోట్ల నిధులతో అభివృద్ధి చేసిన సీహెచ్‌సీని రేపు ప్రారంభించ‌నున్న‌ట్లు ఆ ట్వీట్‌లో మంత్రి హ‌రీష్ వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − two =