టీఎస్‌ ఎడ్‌సెట్‌-2022: దరఖాస్తు గడువు జూన్ 22 వరకు పొడిగింపు

TS EDCET-2022 Last Date for Submission of Online Application Extended Till June 22, Last Date for Submission of Online Application Extended Till June 22, TS EDCET-2022, 2022 TS EDCET, TS EDCET, Telangana State Education Common Entrance Test, Telangana State Education Common Entrance Test Last Date for Submission of Online Application Extended Till June 22, Last Date for Submission of Online Application Extended, TS EDCET-2022 Last Date for Submission of Online Application Extended, TS EDCET 2022 Application Last Date, TS EDCET is a state-level entrance examination conducted by the Osmania University, Osmania University, TS EDCET is a state-level entrance examination, Telangana State Education Common Entrance Test 2022, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్‌ ఎడ్‌సెట్‌-2022 దరఖాస్తు గడువును పొడిగించినట్లు ఎడ్‌సెట్‌ కన్వీనర్ ప్రకటించారు. జూన్ 22 వరకు ఎలాంటి ఆలస్య రుసుం చెల్లించాల్సిన అవసరం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ముందుగా ఎడ్‌సెట్‌-2022 కోసం దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 7న ప్రారంభం కాగా, ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు జూన్‌ 15ను ఆఖరు తేదీగా ప్రకటించారు. అయితే గడువు ముగిసిన నేపథ్యంలో అభ్యర్థులకు మరోసారి అవకాశం కల్పిస్తూ దరఖాస్తు గడువును జూన్ 22 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా జులై 26, 27వ తేదీల్లో తెలంగాణలోని 17 రీజినల్‌ ఆన్‌లైన్ సెంటర్లతో పాటుగా, ఏపీలోని కర్నూల్, విజయవాడ వంటి 2 సెంటర్లలో ఎడ్‌సెట్‌-2022 పరీక్షను నిర్వహించనున్నారు.

టీఎస్ ఎడ్‌సెట్‌-2022 పరీక్షషెడ్యూల్:

  • ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: ఏప్రిల్ 7
  • దరఖాస్తుల స్వీకరణ ఆఖరు తేదీ (ఆలస్య రుసుము లేకుండా) : జూన్‌ 22
  • ఆలస్య రుసుము రూ.250 తో దరఖాస్తుకు ఆఖరు తేదీ: జులై 1
  • ఆలస్య రుసుము రూ.500 తో దరఖాస్తుకు ఆఖరు తేదీ: జులై 15
  • ఎడ్‌సెట్‌ పరీక్ష నిర్వహణ తేదీలు : జులై 26, 27

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 5 =