తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్ బోర్డు కీలక నిర్ణయం.. ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల ఫలితాల్లో హైకోర్టు ఆదేశాలు అమలు

TSLPRB Decides To Implement High Court Orders in The SI Constable Preliminary Exam Results,SI Constable Recruitment in Telangana,PMT-PET Events Completed, Final Written Exams Start from March 12th,Mango News,Mango News Telugu,TSLPRB PMT Events,TSLPRB PET Events,Telangana Physical Tests,Physical Tests For SI,Physical Tests For Constable Posts,Telangana SI Posts,Telangana Constable Posts,Telangana SI,Telangana Constable,Telangana Superendent Inspector,Telangana Constable Posts Latest News and Updates,Telangana News and Live Updates

తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌ పీఆర్‌బీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల నిర్వహించిన ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల ఫలితాల్లో హైకోర్టు ఆదేశాలను అమలు చేయడానికి సిద్ధమైంది. కాగా బహుళైచ్ఛిక సమాధానాలు కలిగిన 7 ప్రశ్నలకు సంబంధించి అటెంప్ట్ చేసిన అభ్యర్థులకు మార్కులు కలపాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో టీఎస్‌ఎల్‌ పీఆర్‌బీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ 7 ప్రశ్నలకు ఇచ్చిన ఆప్షన్‌లలో ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉండటంతో అభ్యర్థులు ఒక్కో సమాధానాన్ని ఎంచుకున్నారు. అయితే రిక్రూట్‌మెంట్ బోర్డు మాత్రం తాము నిర్ణయించుకున్న జవాబుల ప్రకారమే మార్కులు వేసి ఫలితాలు వెల్లడించింది.

దీంతో ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అభ్యర్థుల పిటిషన్‌లను పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం బహుళ జవాబులున్న ప్రశ్నలకు అదనపు మార్కులు ఇవ్వాల్సిందిగా రిక్రూట్‌మెంట్ బోర్డును ఆదేశించింది. దీంతో గతంలో ఈ 7 ప్రశ్నలకు సంబంధించి మార్కులు పొందలేని కారణంగా ఫెయిల్ అయినవారు తాజాగా కోర్టు ఆదేశాల మేరకు ఉత్తీర్ణులవనున్నారు. హైకోర్టు తీర్పుపై ప్రిలిమినరీ పరీక్షలు రాసిన అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు ఉత్తీర్ణులైన వారి జాబితాను రేపు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. అలాగే వారికి త్వరలోనే దేహదారుఢ్య (పార్ట్‌-2) పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న హాల్ టికెట్ నంబర్లతో లాగిన్ అయ్యే అవకాశం కల్పించారు.

ఈ క్రమంలో దేహదారుఢ్య పరీక్షకు ఈ నెల 30వ తేదీ నుంచి వెబ్‌సైట్‌లో లాగిన్ అయి పార్ట్-2 దరఖాస్తును సమర్పించాలని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. కోర్టు ఆదేశాల మేరకు తాజాగా ప్రిలిమినరీలో ఉత్తీర్ణత సాధించిన వారు ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 5వ తేదీ రాత్రి 10 గంటల వరకు పార్ట్-2 దరఖాస్తును సమర్పించాలని సూచించారు. దీనికి సంబంధించిన హాల్‌టికెట్లను ఫిబ్రవరి 8వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 12వ తేదీ రాత్రి 10 గంటల వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, ఫిబ్రవరి 15 నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నామని అధికారులు తెలిపారు. ఇక ఈ పరీక్షల కోసం హైదరాబాద్, సైబదాబాద్, సైబరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ, ఆదిలాబాద్ ప్రాంతాల్లో 10 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ కసరత్తు చేస్తోంది. అయితే ప్రిలిమినరీలో ఉత్తీర్ణత సాధించి ఇప్పటికే ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్ పూర్తి చేసిన వారికి అవసరం లేదని బోర్డు అధికారులు స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 6 =