వరంగల్ లో ముంపు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి కేటిఆర్

#KCR, Heavy Rains In Telangana, KTR, KTR Visits Warangal City to Monitor Rains, Minister KTR, Minister KTR Visits Warangal City, telangana, Telangana CM KCR, Telangana Floods Live Updates, Telangana rains, telangana rains news, telangana rains updates, Warangal Floods, Warangal Rains

వరంగల్ నగరాన్ని ముంచెత్తిన వానలు, వరదల పరిస్థితిని ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం నాడు ప్రత్యేకంగా సమీక్షించారు. అక్కడ చేపట్టిన సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. వరంగల్ నగరంలో స్వయంగా పర్యటించి, పరిస్థితిని పర్యవేక్షించి, అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం ఉదయం హెలికాఫ్టర్ లో వరంగల్ కు చేరుకున్నారు.

ముందుగా వరంగల్ నగరంలో ఏరియ‌ల్ వ్యూ చేపట్టారు. తర్వాత వ‌రంగ‌ల్ న‌గ‌రంలో నయీం నగర్, కేయూ 100 ఫీట్ రోడ్ సహా ఇతర వ‌ర‌ద ముంపు ప్రాంతాల‌ను పరిశీలించారు. ఈ క్రమంలో పున‌రావాస కేంద్రాల‌ను కూడా సందర్శించి బాధితుల‌ను పరామర్శిస్తారు. వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ కూడా మంత్రుల వెంట ఉన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటన అనంతరం వరంగల్ జిల్లాలో వానలు, వరదలు, కరోనా పరిస్థితిపై జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో జిల్లా కలెక్టరేట్ లో మంత్రి కేటిఆర్ సమీక్ష నిర్వహించనున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one − one =