తెలంగాణలో రాష్ట్రంలో మరో 1682 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆగస్టు 17, సోమవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 93,937 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. సోమవారం నాడు 19,579 శాంపిల్స్ పరీక్షించగా, రాష్ట్రంలో మొత్తం పరీక్షలు సంఖ్య 7,72,928 కు చేరుకుంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 235, రంగారెడ్డిలో 166, వరంగల్ అర్బన్ లో 107, మేడ్చల్ లో 106, నిజామాబాద్ లో 94, కరీంనగర్ లో 88, మంచిర్యాలలో 79, జోగులాంబ గద్వాల్ లో 69, జగిత్యాలలో 59, పెద్దపల్లిలో 59, రాజన్న సిరిసిల్లలో 47, సిద్దిపేటలో 47, ఖమ్మంలో 45, కామారెడ్డిలో 44, సూర్యాపేటలో 39, నల్గొండలో 38, మెదక్ లో 36, మహబూబ్ నగర్ లో 32, జనగామలో 32, నాగర్ కర్నూల్ లో 30 నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు వివరాలు (ఆగస్టు 17, రాత్రి 8 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు: 7,72,928
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 93,937
- కొత్తగా నమోదైన కేసులు : 1682
- నమోదైన మరణాలు : 8
- డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 72,202
- కరోనా రికవరీ రేటు: 76.86%
- యాక్టీవ్ కేసులు: 21,024
- హోమ్/ఇన్స్టిట్యూషనల్ ఐసోలేషన్లో ఉన్నవారి సంఖ్య: 14,140
- మొత్తం మరణాల సంఖ్య : 711
- కరోనా మరణాల రేటు: 0.75%
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu