మెదక్ నుంచి లోక్ సభ ఎన్నికల్లో ఈటల పోటీ

A Spear Contest In The Lok Sabha Elections From Medak, A Spear Contest In The Lok Sabha Elections, Sabha Elections Medak, Medak Lok Sabha Elections, Etela Rajender, Medak, Lokh Sabha Elections, Malkajgiri, Latest Lok Sabha Elections, Lok Sabha Elections News Updates, BJP, Modi, CM Revanth Reddy, Polictical News, Elections, Mango News, Mango News Telugu
Etela Rajender, Medak, Lokh sabha elections, Malkajgiri

లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. మరో రెండు మూడు నెలల్లో దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. మొన్నటి వరకు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి కొనసాగగా.. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ఇటీవల తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్.. లోక్‌సభ ఎన్నికల్లో అయినా మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్‌కు 9 మంది ఎంపీలు ఉండగా.. వచ్చే ఎన్నికల్లో 10కి పైగా ఎంపీ స్థానాలను కైవసం చేసుకొని ఢిల్లీలో చక్రం తిప్పాలని ఉవ్విళ్లూరుతోంది.

అటు భారతీయ జనతా పార్టీ తెలంగాణపై ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం బీజేపీకి తెలంగాణలో నలుగురు ఎంపీలు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కనీసం 10 పార్లమెంట్ స్థానాలను అయినా గెలుచుకోవాలని బీజేపీ పరితపిస్తోంది. ఇప్పటికే తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకు బీజేపీ హైకమాండ్ ఇంఛార్జ్‌లను నియమించింది. వారు గెలుపు గుర్రాలను వెతికే పనిలో పడ్డారు. ఈక్రమంలో బీజేపీ నేత, హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల రాజేందర్ తన సొంత నియోజకవర్గమైన హుజురాబాద్, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. కానీ అనూహ్యంగా రెండు స్థానాల్లో ఓటమి పాలయ్యారు. హుజురాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి  పాడి కౌశిక్ రెడ్డి చేతిలో ఓడితే.. గజ్వేల్‌లో గులాబీ బాస్ కేసీఆర్ చేతిలో ఓటమిపాలయ్యారు. రెండు చోట్ల ఓటమిపాలై చేతిలో అధికారంలో ఉన్న ఈటల రాజేందర్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి తన సత్తా చాటు కోవాలను ప్రయత్నిస్తున్నారు. మల్కాజ్‌గిరి లేదా మెదక్ స్థానాల నుంచి పోటీ చేయాలని ఈటల భావిస్తున్నారట.

అయితే ఈసారి మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ టికెట్‌కి గట్టి పోటీ ఉంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ అధినేత మల్కా కొమరయ్య, పీ మురళీధర్ రావుతో పాటు మరికొంత మంది నేతలు పోటీ పడుతున్నారు. అంతేకాకుండా కొత్తగా కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద పేరు తెరపైకి వచ్చింది. ఎలాగైనా మల్కాజ్‌గిరి ఎంపీ స్థానాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తోన్న బీజేపీ.. ఆ స్థానం నుంచి పరిపూర్ణానందను బరిలోకి దింపాలని భావిస్తోందట. త్వరలో దీనిపై హైకమాండ్ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

ఈక్రమంలో ఈటల మెదక్ వైపు చూస్తున్నారట. మెదక్ నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఈటల భావిస్తున్నారట. ఉమ్మడి మెదక్ జిల్లాలో ముదిరాజ్ సామాజిక వర్గ ఓట్లు అధికంగా ఉన్నాయి. ఈక్రమంలో ఆ స్థానం నుంచి పోటీ చేస్తే ఎలాగైనా గెలిచి తీరుతానని ఈటల భావిస్తున్నారట. మరి హైకమాండ్ ఈటలకు ఎంపీ టికెట్ ఇస్తుందా..? లేదా..? అని చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 2 =