నిమ్స్‌కు మంత్రి కేటీఆర్‌.. చీమలపాడు అగ్నిప్రమాద బాధితులకు పరామర్శ, పార్టీ అండగా ఉంటుందని భరోసా

Minister KTR Visits and Assures For The Support To Khammams Cheemalapadu Gas Cylinder Blast Victims in NIMS,Minister KTR Visits and Assures For The Support,Support To Khammams Cheemalapadu Victims,Khammams Cheemalapadu Gas Cylinder Blast Victims,Minister KTR Assures Victims in NIMS,Mango News,Mango News Telugu,Minister KTR visited Cheemalapadu,Cheemalapadu Accident Telangana,Minister KTR consoles Khammam fire accident,Khammam fire accident,Minister KTR Latest News and Updates,Khammam fire accident Live News

ఖమ్మం జిల్లా చీమలపాడులోని ఒక గుడిసెలో ప్రమాదవశాత్తు గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే మరికొందరు గాయపడగా.. వీరిలో నలుగురిని హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రిలో చేర్చారు. ఈ క్రమంలో గురువారం బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ నిమ్స్‌కు వెళ్లి బాధితులను కలిశారు. ఈ ఉదయం మంత్రి పువ్వాడ అజయ్‌, ఎంపీలు నామా నాగేశ్వర రావు, వద్దిరాజు రవిచంద్ర తదితరులతో కలిసి నిమ్స్‌కు చేరుకున్న ఆయన బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కాగా ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు మంత్రి కేటీఆర్‌కు తెలుపగా.. బాధితులకు మెరుగైన వైద్యసాయం అందించాలని సూచించారు.

అనంతరం మీడియాతో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. చీమలపాడు ఘటన దురదృష్టకరమని, ఈ ప్రమాదంలో కుట్ర కోణం ఉందో.. లేదో దర్యాప్తులో తేలుతుందని అన్నారు. ఇక మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించామని, అలాగే గాయపడిన వారికి రూ.2 లక్షలు ప్రకటించామని గుర్తుచేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులను కోరామని, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలకు తాము అండగా ఉంటామని తెలిపారు. కాగా నిన్న ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా బాణాసంచా అంటుకుని ఒక గుడిసెలో ప్రమాదవశాత్తు గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఇక ఈ ఘటనపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − four =