మే నాటికి మన బస్తీ-మన బడి పనులను పూర్తి చేయాలి: మంత్రి తలసాని శ్రీనివాస్

Minister Talasani Srinivas Chairs Review Meeting on Development Works of Mana Basti-Mana Badi Program First Phase,Minister Talasani Srinivas Chairs Review Meeting,Development Works of Mana Basti-Mana Badi,Mana Basti-Mana Badi Program First Phase,Mango News,Mango News Telugu,Minister Talasani Srinivas Yadav About Mana Basti,Complete the Mana Basti Mana Badi works soon,Telangana Mana Ooru Mana Badi Programme 2023,Minister Talasani Srinivas Latest Updates,Minister Talasani Srinivas Live News,Telangana Mana Basti-Mana Badi News Today,Telangana Mana Basti-Mana Badi Latest Updates

మే నాటికి మన బస్తీ-మన బడి పనులను పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. శనివారం నారాయణగూడ లోని కేశవ్ మెమోరియల్ లో మన బస్తీ-మన బడి కార్యక్రమం క్రింద మొదటి విడతలో చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అద్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్ రావు, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కమిషనర్ దేవసేన, జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, జీహెఛ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి, విద్యాశాఖ, జీహెఛ్ఎంసీ, టీఎస్ఎంఐడీసీ, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ, టీఎస్సీఆర్ఐసీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించడం ద్వారా విద్యార్ధులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాబోధన జరగాలనేది ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు లక్ష్యం అని వివరించారు. ఆ ఆలోచనలో నుండి పుట్టిందే మన బస్తీ-మన బడి కార్యక్రమం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం అమలు కోసం రాష్ట్రంలో 26,065 పాఠశాలల్లో అభివృద్ధి పనులకోసం 7,289 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ఇందులో మొదటి విడతలో 35 శాతంగా 9,123 పాఠశాలలల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించి ఇందుకు గాను 3,497 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమం క్రింద ఆయా పాఠశాలల్లో ప్రహరీగోడ నిర్మాణం, భవనాలకు పెయింటింగ్, విద్యుత్ సౌకర్యం, త్రాగునీటి సరఫరా, టాయిలెట్స్ నిర్మాణం, ఫర్నిచర్ ఏర్పాటు, గ్రీన్ చాక్ బోర్డ్ ఏర్పాటు వంటి పనులను చేపడుతున్నట్లు వివరించారు.

హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాల పరిధిలో 690 పాఠశాలలు ఉండగా, మొదటి విడతలో 239 పాఠశాలలను అభివృద్ధి పనులను చేపట్టేందుకు గుర్తించి 44 కోట్ల రూపాయలను కేటాయించినట్టు తెలిపారు. వీటిలో వివిధ కారణాలతో 198 పాఠశాలల్లో మాత్రమే పనులను చేపట్టినట్లు వివరించారు. ఈ పనులను కూడా ప్రభుత్వరంగ సంస్థలైన జీహెఛ్ఎంసీ, టీఎస్ఎంఐడీసీ, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ, టీఎస్సీఆర్ఐసీల ఆధ్వర్యంలో చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు జరిగిన పనుల పురోగతి పై ఆయా సంస్థల వారిగా మంత్రి సమీక్షించారు. విద్యాశాఖ అధికారులతో సమన్వయం చేసుకొంటూ పనులను మరింత వేగవంతం చేసి మే నాటికి పూర్తి చేసే విధంగా కార్యాచరణను రూపొందించుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here