తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం, కానీ రాష్ట్రం కేంద్రప్రభుత్వంతో కలిసి రావడం లేదు – ప్రధాని మోదీ

PM Narendra Modi Addresses Public Meeting at Parade Grounds During Hyderabad Visit,PM Narendra Modi Addresses Public Meeting,Public Meeting at Parade Grounds,Meeting at Parade Grounds During Hyderabad Visit,PM Narendra Modi Meeting at Parade Grounds,Mango News,Mango News Telugu,PM Modi arrives in Hyderabad,PM Narendra Modi Meeting Latest News,PM Modi In Chennai And Hyderabad Today,PM In Hyderabad Today,Narendra Modi News Live,PM Modi Visit Hyderabad Today,PM Narendra Modi Latest News and Updates,National Political News, Latest Indian Political News

తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, కానీ రాష్ట్రం కేంద్రప్రభుత్వంతో కలిసి రావడం లేదని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. శనివారం ఆయన హైదరాబాద్ పర్యటన సందర్భంగా.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు రోడ్డు రవాణా శాఖ ప్రాజెక్టులకు, బీబీనగర్‌లోని ఎయిమ్స్‌ నూతన భవన సముదాయానికి (వర్చువల్‌గా), సికింద్రాబాద్‌ స్టేషన్‌ పునరాభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. సికింద్రాబాద్‌-మహబూబ్‌నగర్‌ మధ్య పూర్తి చేసిన డబ్లింగ్‌, విద్యుద్దీకరణ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. అలాగే సికింద్రాబాద్‌-మేడ్చల్‌ మధ్య కొత్త ఎంఎంటీఎస్‌ సర్వీసులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, మరో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సీఎం కేసీఆర్ మరియు బీఆర్ఎస్ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు చేశారు.

ప్రధాని మోదీ ప్రసంగంలోని కొన్ని కీలక అంశాలు..

  • ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభిస్తూ సోదర సోదరీమణులకు స్వాగతం అని చెప్పారు.
  • ఏపీ-తెలంగాణ రాష్ట్రాలను సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలుతో అనుసంధానం చేశాం.
  • ఒకే రోజు 13 ఎంఎంటీఎస్ రైళ్లను ప్రారంభించాం, అలాగే ఎంఎంటీఎస్ విస్తరణ కోసం రూ.600 కోట్లు కేటాయింపు.
  • తెలంగాణలో నాలుగు హైవేలకు శ్రీకారం చుట్టాం. హైదరాబాద్‌ రింగ్‌రోడ్డు ప్రాజెక్టు కూడా అమల్లో ఉంది.
  • దేశాభివృద్ధిలో తెలంగాణ భాగమయ్యేలా చూశాం. హైదరాబాద్‌- బెంగళూరు అనుసంధాన్ని మెరుగుపరుస్తున్నాం.
  • దేశవ్యాప్తంగా 7 మెగా టెక్స్‌టైల్స్‌ పార్కుల ఏర్పాటు చేస్తున్నాం.. తెలంగాణలో కూడా ఒక మెగా టెక్స్‌టైల్స్‌ పార్కు ఏర్పాటు చేస్తాం.
  • దేశంలో వారసత్వ రాజకీయాల్లో భాగంగా పేదల రేషన్‌ కూలా లాక్కున్నారు, అయితే మేము నేడు 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్‌ అందిస్తున్నాం.
  • కుటుంబవాదంతో రాజకీయాలు నడపాలని చూస్తున్నారు. దీనిని కాపాడుకోవడం కోసం ప్రతీ వ్యవస్థను తమ అదుపులో పెట్టుకోవాలని భావిస్తున్నారు.
  • ఈ తరుణంలో దేశాన్ని అవినీతి నుంచి విముక్తి చేయాలా వద్దా? అవినీతిపరులపై పోరాటం చేయాలా?.. వద్దా? అవినీతిపరులపై చట్టప్రకారం చర్యలు చేపట్టాలా.. వద్దా?
  • తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో కలిసి రావడం లేదు, అందుకే అభివృద్ధి పనుల్లో ఆలస్యం జరుగుతోంది.
  • తెలంగాణలో కుటుంబపాలనతో అధికారం కొందరి గుప్పెట్లోనే మగ్గుతోంది, వారు అవినీతిని పెంచిపోషిస్తున్నారు.
  • ప్రజల సొమ్ము అవినీతిపరులకు చేరకుండా చర్యలు చేపట్టాం, డిజిటల్‌ పేమెంట్స్‌ ద్వారా దళారీ వ్యవస్థ లేకుండా చేశాం.
  • అందుకే నేరుగా రైతులు, విద్యార్థుల ఖాతాల్లోనే ప్రభుత్వ సంక్షేమ పథకాల నిధులు జమ చేస్తున్నాం.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =