రంగనాథ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై మంత్రి తలసాని సమీక్ష

Minister Talasani Srinivas held Review on Arrangements of Vaikunta Ekadashi at Ranganatha Swamy Temple,Minister Talasani Srinivas,Review on Arrangements,Vaikunta Ekadashi,Ranganatha Swamy Temple,Mango News,Mango News Telugu,Vaikunta Ekadasi 2023 Date In Tirumala,Vaikunta Ekadasi 2023,Vaikunta Ekadasi 2022 Usa,Vaikunta Ekadasi 2022 News,Vaikunta Ekadasi 2022 Date In Tirumala,Vaikunta Ekadasi 2022,Vaikunta Ekadasi 2021,Vaikunta Ekadasi,Vaikunta Ekadashi Mantra,Vaikunta Ekadashi 2023,Today Vaikunta Ekadashi,This Year Vaikunta Ekadashi Date,This Year Vaikunta Ekadashi,Significance Of Vaikunta Ekadashi,Happy Vaikunta Ekadashi,2022 Vaikunta Ekadashi Date

వైకుంఠ ఏకాదశికి ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. మంగళవారం కార్వాన్‌ నియోజకవర్గ పరిధిలోని జియాగూడాలో రంగనాథ స్వామి ఆలయం వద్ద వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం తరువాత జియాగూడలోని రంగనాథ ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఎంతో ఘనంగా, అద్భుతంగా జరుగుతాయని అన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వైకుంఠ ద్వార దర్శనానికి వస్తారని వెల్లడించారు. భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నట్లు తెలిపారు.

ఆలయం వద్ద భక్తులు తోపులాటకు గురికాకుండా బారికేడ్ లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆలయ పరిసరాలలో విద్యుత్ లైట్ లను ఏర్పాటు చేయాలని, వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ప్రాంతాలను గుర్తించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. భక్తుల సౌకర్యార్ధం మొబైల్ టాయిలెట్ ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అదేవిధంగా భక్తులకు అందించేందుకు లక్ష మంచినీటి ప్యాకెట్ లను అందుబాటులో ఉంచాలని వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు. ఆలయ పరిసరాలలో ఎక్కడా కూడా సీవరేజ్ లీకేజీలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఆలయానికి వచ్చే రహదారులపై నిలిపి ఉంచిన వాహనాలను పూర్తిస్థాయిలో తొలగించాలని, వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు ఇబ్బందులకు గురికాకుండా ట్రాపిక్ డైవర్షన్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులను, శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుండి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్ధం ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రెండు హెల్త్ క్యాంప్ లను ఏర్పాటు చేయనున్నట్లు వైద్య శాఖ అధికారులు తెలిపారు. ఏర్పాట్లపై సమీక్షకు ముందుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =