ఏపీ ఎన్నికల ముందు పవన్ తప్పు చేశాడా?

Did Pawan make a mistake before the AP elections,Did Pawan make a mistake,mistake before the AP elections,AP elections,Pawans alliance with BJP , AP elections, TDP, BJP, Jana sena, KCR,Congress, Brs , Congress victory, Telangana angry with KCR,Telangana Assembly Elections 2023,assembly seat, Telangana Election, BJP,Mango News,Mango News Telugu,AP elections Latest News,Jana sena News,Jana sena Latest Updates,Assembly Election Results 2023,Telangana Latest News and Updates
Pawan's alliance with BJP , AP elections, TDP, BJP, Jana sena, KCR,Congress, Brs , Congress victory, Telangana angry with KCR,Telangana Assembly Elections 2023,assembly seat, Telangana Election, BJP,

ఆవేశపూరిత నిర్ణయాలు, దీనికి తోడు మొహమాటం, ఇంకా పూర్తిగా రాజకీయ పరిపక్వత రాలేదు వంటి విమర్శలు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై చాలానే ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మరోసారి పవన్ పోటీపై  తీసుకున్న నిర్ణయంపై మరోసారి విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు తెలంగాణలో పోటీ చేయడమే తప్పుడు నిర్ణయం అనుకుంటే.. బీజేపీతో పొత్తు పెట్టుకుని మరీ బరిలో దిగడం ఇంకా తప్పని  రాజకీయ  విశ్లేషకులు  అంటున్నారు.

దశాబ్దాల తరబడి రాజకీయాలలో మంచి పేరు, పలుకుబడి ఉన్న టీడీపీనే తెలంగాణలో పోటీకి దిగకుండా బ్యాక్  స్టెప్ వేసింది. కానీ తనకు ఎటువంటి అనుకూల పవనాలు లేనప్పుడు కాస్త కూడా  ఆలోచించకుండా పవన్ జనసైన్యాన్ని బరిలోకి దింపడం  రాజకీయంగా సరైంది కాదని .. ఈ ఎన్నిల  ఫలితాలు మరోసారి  రుజువు చేశాయని పొలిటికల్ ఎక్స్‌పెర్ట్స్ అంటున్నారు.

ఏకంగా 32 స్థానాల్లో ముందుగా పోటీకి నిలబెట్టాలని ఏ ధైర్యంతో అనుకున్నారా అని పొలిటికల్ సర్కిల్‌లో చర్చ జరుగుతుంది. చివరకు బీజేపీతో పొత్తుతో  8 స్థానాలకు పరిమితమైన జనసేన.. కనీసం ఆ  8 స్థానాలలో అయినా ఎక్కడా కూడా సరైన పోటీని ఇవ్వలేకపోయింది. దీంతో తెలంగాణ ప్రజలుగా తమ అభిమాన హీరోను చూడటానికి పవన్ ప్రచారాలకు వచ్చారు తప్ప.. తెలంగాణ ఓటర్లుగా జనసేన పట్ల ఎటువంటి ఆసక్తి లేదని  రుజువు అయిపోయింది.

ఏపీ..తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని భౌగోళికంగా రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణ ఓటర్.. ఆంధ్ర ప్రాంత పార్టీలంటే ఏ మాత్రం ఆసక్తి చూపించడం లేదని  ఈ ఫలితాలు రుజువు చేశాయి.టీడీపీకి ఇక్కడ విపరీతమైన పట్టున్నా, కొన్ని చోట్ల బీభత్సమైన అభిమానులు ఉన్నా కూడా ఎన్నికలలో పోటీ చేయడానికి వెనుకడుగు వేసింది. అనువుగాని చోట అధికులమనకూడదన్న మౌలిక సూత్రాన్ని ఫాలో అయింది. కానీ జనసేనాని మాత్రం ఈ విషయం  మర్చిపోయి భారీ మూల్యాన్నే చెల్లించుకున్నారు.

ఎందుకంటే ఏపీ ఎన్నికలు మార్చిలో రాబోతున్నాయన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. అలాంటి సమయంలో  ఈ ఎన్నికల ఫలితాలు ఏపీలో జనసేనకు ఇబ్బందిని కలిగించే వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. ఇక నుంచి జనసేనను విమర్శించాలనుకుంటున్న ప్రతి వైసీపీ నేతకు..  తెలంగాణ ఫలితాలు సాకుగా చూపించి మాట్లాడే అవకాశాన్ని ఇచ్చినట్లే అవుతుంది.

అంతెందుకు ఏపీలో టీడీపీతో పొత్తుతో ముందుకెళ్దామని అనుకుంటున్న పవన్ కళ్యాణ్‌కు  సీట్ల బేరాలలో కూడా ఈ ఫలితాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. సీట్ల విషయంలో గట్టిగా డిమాండ్ చేసే ఛాన్స్‌ను పవన్ కోల్పోయినట్లే అయింది. ఏపీ రాజకీయాల్లో పవన్ అత్యంత కీలకమైన దశలోకి వెళుతున్న ఈ సమయంలో తెలంగాణ ఫలితాలు ఓటర్లలో కూడా రెండో ఆలోచనను రేకెత్తించేలా ఉన్నాయి. నిజానికి తెలంగాణలో పోటీ ద్వారా జనసేనకు మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుందని తెలిసినా పవన్ పోటీకి ఎందుకు సాహసించాడనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 13 =