మొండా మార్కెట్ లో విస్తృతంగా పర్యటించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

Development Plan, Hyderabad’s Monda Market to get much-awaited facelift, Mango News, Minister Talasani Srinivas Yadav, Minister Talasani Srinivas Yadav Visits Monda Market and Discussed Development Plan, Monda Market, Monda Market Development, Monda Market Development Plan, Monda Market to be remodelled along with road-widening, Secunderabad’s Monda Market, Talasani Srinivas Yadav Visits Monda Market

ఎంతో చరిత్ర కలిగిన సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మొండా మార్కెట్ ను ఇటీవల అభివృద్ధి చేసిన మొజంజాహీ మార్కెట్ తరహాలో తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మున్సిపల్ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ తో కలిసి మొండా మార్కెట్ లోని కూరగాయల మార్కెట్, మటన్ మార్కెట్, చేపల మార్కెట్, పాట్ మార్కెట్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. మార్కెట్ అభివృద్ధికి చేపట్టవలసిన చర్యలు, మార్కెట్ కు ఉన్న ప్రాధాన్యత, చరిత్రను మంత్రి వివరించారు. నిజాం నవాబు కాలంలో నిర్మించిన ఈ మార్కెట్ లో అనేక మంది చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించుకొంటూ జీవనం సాగిస్తున్నారని మంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కి వివరించారు.

వ్యాపారులు, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు, వసతులు కల్పించి ఈ మార్కెట్ ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇందుకోసం సమగ్ర నివేదికను రూపొందించేందుకు ఒక కన్సల్టెన్సీని నియమించడం జరిగిందని, 15 రోజులలో నివేదిక అందజేయాలని కన్సల్టెన్సీ సంస్థను ఆదేశించినట్లు చెప్పారు. నివేదిక వచ్చిన తర్వాత వ్యాపారులతో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. అదేవిధంగా పాత ఓల్డ్ జైల్ ఖానా వెనుక భాగంలో ఉన్న స్థలంలో మల్టి లెవెల్ పార్కింగ్ ను నిర్మించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. వాహనదారుల ఇబ్బందులు, ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా పాలికా బజార్ చౌరస్తా నుండి మొండా మార్కెట్ లోని కూరగాయల బజార్ వరకు రోడ్డు విస్తరణ చేయాలని, పాత గాంధీ హాస్పిటల్ గోదాం ను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ సీసీపీ దేవేందర్ ను మంత్రి ఆదేశించారు. మార్కెట్ ను ఇక్కడి నుండి తరలిస్తారని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని అన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్ దీపిక, వాటర్ వర్క్స్ జీఎం రమణారెడ్డి, టౌన్ ప్లానింగ్ ఏసీపీ మహేందర్, తదితరులు ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 − 1 =