కల్లుగీత వృత్తిదారులకు ఎక్స్ గ్రేషియో పంపిణీ

Ex-gratia Cheques To Palm Tree Workers, Mango News Telugu, Minister V Srinivas Goud, Palm Tree Workers In Telangana, Political Updates 2019, telangana, Telangana Breaking News, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019

రాష్ట్ర అబ్కారీ శాఖ ఆధ్వర్యంలో కల్లుగీత వృత్తిదారులకు ఎక్స్ గ్రేషియో పంపిణీ  కార్యక్రమాన్ని రాష్ట్ర అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రవీంద్రభారతిలో ప్రారంభించారు. 10 కోట్ల 9 లక్షల 30 వేల రూపాయల ఎక్స్ గ్రేషియోను గీత వృత్తిదారులలోని బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కులవృత్తులకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ఎంతో కృషి చేస్తున్నారు. అందులో భాగంగా బీసీల ఆత్మగౌరవ భవనాలకు  80 ఎకరాల ఎంతో విలువైన భూమిని కేటాయించి భవనాల నిర్మాణాలకు పూనుకున్నారని చెప్పారు. ఎన్నో ఏళ్ల నుండి గీత వృత్తిదారులు నీరా పాలసీ పై గత ప్రభుత్వాలకు విన్నవించిన పట్టించుకోకుండా కాలయాపన చేశారన్నారు. సీఎం కేసీఆర్ గీత వృత్తిదారుల సంక్షేమానికి ప్రతిష్టాత్మకంగా నీరా పాలసీని ప్రకటించారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీ నారాయణ గౌడ్, V. గంగాధర్ గౌడ్, మాజీ శాసన మండలి ఛైర్మన్ స్వామి గౌడ్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఛైర్మన్ లు రాజేశం గౌడ్, నాగేందర్ గౌడ్, మాజీ శాసన సభ్యులు సత్యనారాయణ గౌడ్, భిక్షమయ్య గౌడ్, ప్రభుత్వ స్పెషల్ సీఎస్ సోమేష్ కుమార్, అబ్కారీ శాఖ ఉన్నతాధికారులు అజయ్ రావు, హరి కిషన్, దత్తరాజ్ గౌడ్, చంద్రయ్య, గౌడ సామాజిక వర్గ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =