ప్రముఖ టాలీవుడ్ నటుడు జూ. ఎన్టీఆర్‌తో కలిసి సందడి చేసిన టీమిండియా క్రికెటర్లు

Team India Cricketers Meets Tollywood Star Actor Jr NTR in Hyderabad Ahead of ODI Series Against New Zealand,Team India Cricketers,Meets Tollywood Star Actor Jr NTR,Tollywood Star Actor Jr NTR,Jr NTR in Hyderabad,Ahead of ODI Series,ODI Series Against New ,India Vs New Zealand,Mango News,Mango News Telugu,New York Film Critics Circle,Mega Power Star Ram Charan,Mega Power Star,S.S.Rajamouli,RRR,Rise Roar Revolt,Ram Charan Latest News and Updates,Ram Charan News and Live Updates,Ram Charan Latest Movie Updates

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా బుధవారం జరుగనున్న ఆరంభ పోరు కోసం టీమిండియా జట్టు ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకుంది. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌తో పాటు మూడు టీ20లు కూడా భారత్ ఆడనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం వేదికగా రేపు తొలి వన్డే ఆడనుంది. ఈ క్రమంలో పలువురు టీమిండియా యువ క్రికెటర్లు ప్రముఖ టాలీవుడ్ నటుడు, ‘ఆర్ఆర్ఆర్’ స్టార్ జూనియర్ ఎన్టీఆర్‌ను కలిశారు. వీరిలో బ్యాటింగ్ సంచలనం సూర్యకుమార్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ మరియు శార్దూల్ ఠాకూర్ తదితరులు ఉన్నారు. కాగా తారక్‌ టీమిండియా క్రికెటర్‌లతో కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

అయితే దీనికిముందు జూనియర్ ఎన్టీఆర్ అమెరికాలోని కాలిఫోర్నియా వేదికగా ఆస్కార్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌ వేడుకలో పాల్గొన్నారు. తన సహచర నటుడు రామ్‌చరణ్‌తో కలిసి అతను నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఉత్తమ పాట అవార్డుతో పాటు ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలో క్రిటిక్స్ ఛాయిస్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. టాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా పలు రికార్డులతో పాటు అవార్డులను సైతం కొల్లగొడుతోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అమెరికా అనంతరం పర్యటన ముగించుకుని నగరానికి తిరిగి వచ్చారు. ఈ క్రమంలోనే పలువురు భారత క్రికెటర్లు ఆయనను కలుసుకున్నట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here