కళాశాలలకు ఎన్‌ఓసి జారీ చేసే అంశంపై మంత్రుల సమీక్ష

Application For No Objection Certificate, Issue of NOC for Colleges, Minister Mahmood Ali, NOC for Colleges, Request Application for NOC from College, Sabitha Indra Reddy, Sabitha Indra Reddy Convened a Meeting on Issue of NOC for Colleges, Telangana Issue of NOC for Colleges

తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అగ్నిమాపక సేవల విభాగం నుండి కళాశాలలకు ఎన్‌ఓసి జారీ చేయాల్సిన సమస్యలు మరియు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సీనియర్ ఆఫీసర్లతో కలిసి హోంమంత్రి కార్యాలయంలో శనివారం నాడు సమావేశమయ్యారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పరిధిలోని కళాశాలలకు అనుమతిని ఇవ్వడం మరియు లక్షలాది ఇంటర్మీడియట్ విద్యార్థులపై ప్రభావం చూపే ఈ సమస్యను పరిష్కరించడం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.

ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ, ప్రజల ప్రాణాలను మరియు ఆస్తిని అగ్ని ప్రమాదాల నుండి రక్షించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. కోవిడ్ -19 ప్రభావం ఉన్న ఈ అసాధారణ సంవత్సరంలో విద్యార్తుల భవిష్యత్తును పరిగణనలోకి తీసుకునేనందుకు, చట్టం మరియు నిబంధనలకు అనుగుణంగా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని నిర్ణయించారు. విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, హోంశాఖ అధికారులు ఈ సమస్యను జాగ్రత్తగా పరిశీలిస్తారని, అసాధారణ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని పరిష్కారాన్ని సూచిస్తారని చెప్పారు. ఈ విషయాన్ని వివరంగా పరిశీలిస్తామని, తదనుగుణంగా ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 18 =