మోగిన ఎన్నికల నగారా.. బీఆర్ఎస్‌ను మోయాల్సింది ఆ ఇద్దరేనా?

Are they responsible for BRS,responsible for BRS,Are they responsible,Mango News,Mango News Telugu,CM KCR, KTR, Minister Harish Rao, Telangana Assembly Elections, Telangana Politics,BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Hyderabad News,BRS Latest News,BRS Latest Updates,BRS Live News
kcr

తిమ్మిని బమ్మి చేయగల సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్. మాటల తూటాలు పేల్చడంలో కేసీఆర్ తర్వాతే ఎవరైనా. ఆయన చెప్పే డైలాగుల్లో కిక్కే వేరు అసలు. సమయానుసారంగా కేసీఆర్ చెప్పే డైలాగులు.. వేసే పంచులకు జనాలు ఇట్టే ఆకర్శితులైపోతుంటారు. కేసీఆర్ సభ ఉందంటే చాలు జనాలు పరుగులు తీస్తుంటారు. మాటల మాంత్రికుడి ప్రెస్ మీట్ అంటే టీవీలకు అతుక్కుపోతుంటారు. అంతటి ఆసక్తిగా ఉంటాయి కేసీఆర్ మాటలు. అటువంటిది సరైన సమయానికి కేసీఆర్ అనారోగ్యం బారిన పడ్డారు. ఓ వైపు ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంటే కేసీఆర్ మాత్రం అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. కొద్దిరోజులుగా వైరల్ ఫీవర్‌తో సతమతమయిన కేసీఆర్.. ఇప్పుడు చాతి ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు.

అయితే ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలని ఎప్పటి నుంచో కేసీఆర్ ఉవ్విళ్లూరుతున్నారు. దక్షిణ భారత్‌లో ఏ నాయకుడు సాధించని రికార్డు సాధించాలని ఆశపడుతున్నారు. ఇందుకోసం అందరికంటే ముందే కేసీఆర్ ఎన్నికల రంగంలోకి దూకేశారు. పక్కాగా ప్లాన్ రెడీ చేసుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ కూడా రాకముందే తమ అభ్యర్థులను ప్రకటించేశారు. ఎప్పటి నుంచో బీఆర్ఎస్ నేతలను జనాలకు దగ్గరగా ఉంచుతున్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూడా దాదాపు నెరవేర్చారు. అటు ఎన్నికల వరకు ప్రతి జిల్లాలోనే ఓ సభ నిర్వహించాలని కేసీఆర్ ప్లాన్ చేశారు.

కానీ సరైన సమయానికి కేసీఆర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రచారాలు, సభలతో హోరెత్తించాల్సిన సమయంలో కేసీఆర్ ఇంటి పట్టున ఉండాల్సి వస్తోంది. మరికొన్ని రోజులు కేసీఆర్ విశ్రాంతి తీసుకోవాలని అటు వైద్యులు చెబుతున్నారు. ఈ సమయంలో బీఆర్ఎస్ బరువు, బాధ్యతలు మోసేది ఎవరనే డౌట్ అందరిలోనే మెదులుతోంది. ఈ సమయంలో కేటీఆర్, మంత్రి హరీశ్ రావుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఈ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ బరువు, బాధ్యత అంతా వారిద్దరిదే అనే వాదన వినిపిస్తోంది.

మాటల తూటాలు పేల్చడంలో కేటీఆర్, హరీష్ రావు కూడా ఏం అంత తక్కువ కాదు. కేసీఆర్ అంత కాకపోయినప్పటికీ.. ఈ ఇద్దరు కూడా మాటకారులే. కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్‌లో ప్రత్యర్థుల మెడలు వంచే నాయకులు ఉన్నారంటే అది కేటీఆర్, హరీష్ రావులే. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే.. కేసీఆర్ కోలుకొని రంగంలోకి దిగే వరకు.. కేటీఆర్, హరీష్ రావులే పార్టీ బరువు, బాధ్యతలు మోయక తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు. అటు కేటీఆర్ కూడా వరుసగా సభలు నిర్వహిస్తూ తూటాలు పేలుస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × one =