గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హైదరాబాద్‌లో మొక్కలు నాటిన నటి కంగనా రనౌత్‌, అభినందించిన ఎంపీ సంతోష్‌

MP Santosh Kumar Thanked as Actress Kangana Ranaut Participated in Green India Challenge by Planting at Hyderabad, MP Santosh Kumar Thanked Kangana Ranaut, Kangana Ranaut Takes Part In Green India Challenge, Kangana Ranaut, Kangana Ranaut Green India Challenge, Green India Challenge,Mango News,Mango News Telugu, Kangana Ranaut Husband,Green India Challenge,Green India Challenge Founder,Green India Challenge Santosh,Green India Challenge Started By,Green India Challenge Telangana,Green India Challenge Twitter,Green India Challenge Website,Green India Challenge Wikipedia,Is Kangana Ranaut Married,Kangana Ranaut,Kangana Ranaut Age,Kangana Ranaut Box Office Collection,Kangana Ranaut Dhaakad,Kangana Ranaut Instagram,Kangana Ranaut Movie List,Kangana Ranaut Net Worth,Kangana Ranaut Son,Kangana Ranaut Twitter,Kangana Ranaut Upcoming Movies,Kangana Ranaut Wikipedia

ప్రముఖ నటి కంగనా రనౌత్‌కు తెలంగాణ ఎంపీ సంతోష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆమె గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హైదరాబాద్‌లో బుధవారం మొక్కలు నాటారు. నగరంలోని శంషాబాద్ పంచవటి పార్కులో కంగనా రనౌత్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సహ వ్యవస్థాపకుడు రాఘవ ‘వృక్షవేదం’ పుస్తకాన్ని ఆమెకు బహూకరించారు. అనంతరం కంగనా రనౌత్‌ మాట్లాడుతూ.. హారా హై తో భారా హై, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమాలను స్వీకరిస్తూ ఈరోజు హైదరాబాద్‌లో మొక్కలు నాటానని తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం ఆనందంగా ఉందని, చెట్లను నాటడం మరియు మన పర్యావరణాన్ని పరిరక్షించడం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి ఇది ఒక గొప్ప ఆలోచన అని పేర్కొన్నారు. పర్యావరణం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని కోరుతున్నానని, అలాగే ఈ ఛాలెంజ్ కోసం రంగోలి చందేల్, రీతూ రనౌత్ మరియు అంజలి చౌహాన్‌లను నామినేట్ చేస్తున్నానని తెలిపారు.

ఇక దీనిపై ఎంపీ సంతోష్‌ కుమార్‌ స్పందించారు. తన ట్విట్టర్ వేదికగా కంగనాకు అభినందనలు తెలిపారు. ‘అద్భుతం కంగనా రనౌత్ జీ! గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటినందుకు ధన్యవాదాలు. మీరు ఈ రోజు చేసిన పనిని పాన్‌-ఇండియా అంతటా ఉన్న మీ అభిమానులు రేపటి కోసం పునరావృతం చేస్తారని ఆశిస్తున్నాను’ అని అందులో పేర్కొన్నారు. కాగా 2019లో రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పౌరులు మొక్కలు నాటడంతోపాటు పర్యావరణం పట్ల బాధ్యత వహించేలా ప్రోత్సహించడం లక్ష్యంగా ఆయన దీనిని నిర్వహిస్తున్నారు. ఇక ఈ ఛాలెంజ్‌లో ఇప్పటివరకు నటులు మహేష్ బాబు, ప్రభాస్, రానా దగ్గుబాటి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + ten =