మోగిన ఎన్నికల నగారా.. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్

Telangana Election Schedule Released,Telangana Election Schedule,Election Schedule Released,Mango News,Mango News Telugu,5state Elections, Election Schedule, Madhyapradesh, Mizoram, Rajasthan, Telangana Assembly Elections,5 State Elections Latest News,5 State Elections Latest Updates,5 State Elections Live News,Telangana Election Schedule News Today,Mizoram Live Updates

ఎన్నికల నగారా మోగింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రానే వచ్చింది. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. మొత్తం ఐదు రాష్ట్రాల్లోని 679 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో నేటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

30న తెలంగాణలో ఎన్నికలు

ఎన్నికల షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో నవంబర్ 3న ఎన్నికల గెజిట్ విడుదల కానుంది. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు నవంబర్ 10 వరకు ఎన్నికల సంఘం సమయం ఇచ్చింది. నవంబర్ 13 వరకు అధికారులు నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరించుకునేందుకు నవంబర్ 15 వరకు సమయం ఇచ్చారు. ఇక నవంబర్ 30న రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఓట్లను లెక్కించనున్నారు.

ఓటర్ల వివరాలు..

తెలంగాణలో మొత్తం 3.17 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ఎన్నికల సంఘం వెల్లడించింది. అందులో పురుష ఓటర్లు 1.58 కోట్లు.. మహిళా ఓటర్లు 1.58 కోట్లుగా ఉన్నారి పేర్కొంది. ఒక దివ్యాంగులు 5.0 లక్షల మంది.. 80 ఏళ్ల వయసు పైబడిన వారు 4.4 లక్షల మంది ఉన్నారని తెలిపింది. ఈసారి కొత్తగా చేరిన ఓటర్ల సంఖ్య 17,01,087గా ఉందని.. మొట్టమొదటిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారి సంఖ్య 8.11 లక్షలుగా ఉందని ఎన్నికల సంఘం వెల్లడించింది.

డిసెంబర్ 3న ఫలితాలు

ఇకపోతే మిజోరంలో నవంబర్ 7న, మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న, రాజస్థాన్‌లో నవంబర్ 23న అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 7న మొదటి విడుత.. రెండో విడత నవంబర్ 17న నిర్వహించనున్నట్లు వివరించింది. డిసెంబర్ 3న ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి.. అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నట్లు వెల్లడించింది.

తెలంగాణలో 119 నియోజకవర్గాలు, రాజస్థాన్‌లో 200 నియోజకవర్గాలు, మధ్యప్రదేశ్‌లో 230 నియోజకవర్గాలు, ఛమిజోరంలో 40 నియోజకవర్గాలు, ఛత్తీస్‌గఢ్‌లో 90 నియోజకవర్గాలు ఉన్నాయి. అలాగే రాజస్థాన్‌లో 5.25 కోట్ల మంది ఓటర్లు, మధ్యప్రదేశ్‌లో 5.6 కోట్ల మంది ఓటర్లు, మిజోరంలో 8.52 లక్షల మంది ఓటర్లు, చత్తీస్‌గఢ్‌లో 2.03 కోట్ల మంది ఉన్నారు. తెలంగాణలో ఎన్నికల కోసం 35,356 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఈసీ ప్రకటించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + three =