తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగిన “ముక్కోటి వృక్షార్చన”

Happy birthday KTR, KTR Birthday Celebrations, KTR’s Unique Birthday Celebration Once Again, Mango News, Minister KTR, Minister KTR Birthday Celebrations, Mukkoti Vruksharchana, Mukkoti Vruksharchana Held in a Grand Way in Telangana, Mukkoti Vruksharchana Held in a Grand Way in Telangana on the Occasion of Minister KTR Birthday, Mukkoti Vruksharchana Held on the Occasion of Minister KTR Birthday, Mukkoti Vruksharchana On KTR Birthday, Mukkoti Vruksharchana Program, Mukkoti Vruksharchana Program Telangana, Telangana Minister KTR, Telangana Minister KTR’s birthday

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా శనివారం నాడు తెలంగాణ రాష్ట్రంలో “ముక్కోటి వృక్షార్చన” కార్యక్రమం ఘనంగా జరిగింది. టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ ఆధ్వర్యంలో ఒకేరోజు, ఒకే గంటలో మూడుకోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టారు. శనివారం ఉదయం జరిగిన ఈ ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో పలువురు రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొని మొక్కలు నాటారు.

రాజ్య‌స‌భ ఎంపీ జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్, మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ సహా ఇతర నాయకులతో కలిసి రామ‌గుండంలో ముక్కోటి వృక్షార్చ‌న కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించి, మొక్క‌లు నాటారు. శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి ప్రొటెం ఛైర్మన్‌ భూపాల్‌ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్య‌క్ర‌మంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పాల్గొన్నారు. అలాగే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మహమూద్‌ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ అజయ్ కుమార్, జగదీష్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సహా పలువురు మంత్రులు కూడా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 7 =