టోక్యో ఒలింపిక్స్ లో భారత్ బోణీ, వెయిట్‌ లిఫ్టర్‌ మీరాభాయి చానుకు రజత పతకం

India’s 1st Medal: Weightlifter Mirabai Chanu Wins Silver, Mango News, Mirabai Chanu becomes 1st Indian weightlifter, Mirabai Chanu creates history, Mirabai Chanu wins silver in 49kg, Mirabai Chanu wins silver medal in Weightlifting Women, Mirabai Chanu wins Silver to give India first medal, Tokyo 2020, Tokyo Olympics, Tokyo Olympics 2020, Weightlifter Mirabai Chanu Wins Silver, Weightlifter Mirabai Chanu wins silver medal, Weightlifting

టోక్యో ఒలింపిక్స్-2020 క్రీడల్లో భారత్ బోణీ కొట్టింది. ఒలింపిక్స్ ప్రారంభమైన రెండో రోజే భారత త్రివర్ణ పతాకం రెపరెపలడింది. వెయిట్‌ లిప్టింగ్ విభాగం ద్వారా టోక్యో ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో తోలి పతకం చేరింది. వెయిట్ లిఫ్టర్‌ మీరాభాయి చాను రజత పతకం సాధించింది. మహిళల 49 కిలోల విభాగంలో రజత పతకం గెలుచుకుని, కరణం మల్లీశ్వరి తర్వాత వెయిట్‌ లిప్టింగ్ లో భారత్ కు పతకం అందించిన మహిళగా మణిపూర్ కు చెందిన మీరాభాయి చాను చరిత్ర సృష్టించింది.

స్నాచ్ లో 84 కిలోలు మరియు 87 కిలోలు లిఫ్ట్ చేసిన ఆమె, 89 కిలోల బరువులో విఫలమైంది. అలాగే క్లీన్‌ అండ్‌ జర్క్‌ లో తొలి ప్రయత్నంలో 110 కేజీలు, రెండో ప్రయత్నంలో 115 కేజీలను లిఫ్ట్ చేసి, మూడో ప్రయత్నం 117 కేజీలలో విఫలమయింది. మొత్తంగా 202 కిలోలు (స్నాచ్ లో 87, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 115) తో రెండో స్థానంలో నిలవడంతో మీరాభాయి చాను రజత పతకం కైవసం చేసుకుంది. ఇక ఈ విభాగంలో చైనాకు చెందిన జహీహు హౌ బంగారు పతకం గెలుచుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 6 =