మునుగోడు ఉపఎన్నిక ప్రచారం రేపటితో బంద్, స్థానికేతరులు నియోజకవర్గాన్ని వీడాలి – సీఈఓ వికాస్ రాజ్

Munugode By-poll Telangana Chief Electoral Officer Vikas Raj Announces Campaign Should be Closed by Tomorrow Evening, Chief Electoral Officer Vikas Raj, Munugode Campaign Closed by Tomorrow Evening, Munugode By-poll Campaigning, Mango News,Mango News Telugu, TRS Party, Munugode By-Poll, TRS Party Munugode By-Poll, Munugode Bypoll Elections, Munugode Bypoll, CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP , Munugode By Polls, Munugode Election Schedule Release, Munugode Election, Munugode Election Latest News And Updates

మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి రేపటితో (మంగళవారం) తెర పడుతుందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్ రాజ్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోమవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. ఉపఎన్నికకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, అలాగే ఎన్నిక ప్రశాంతంగా జరగడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా సీఈఓ వికాస్ రాజ్ మాట్లాడుతూ.. రేపు సాయంత్రం 6 గంటలతో ప్రచారం ముగుస్తోందని, ఈ క్రమంలో స్థానికేతరులు నియోజకవర్గాన్ని వీడాలని సీఈవో వికాస్‌ రాజ్‌ సూచించారు. మునుగోడు ఉపఎన్నికకు నవంబర్ 3వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్‌ నిర్వహిస్తామని, ఇక ఈ ఉప ఎన్నికలో మొత్తం 2,41,855 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగంచుకోనున్నారని తెలిపారు. వీరిలో పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు 5,686 మంది ఉన్నారని, అయితే పోస్టల్ బ్యాలెట్ కోసం కేవలం 739మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని సీఈఓ వెల్లడించారు.

మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, 45 ప్రాంతాల్లోని 105 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించామని తెలిపారు. అలాగే ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ మరియు ముగ్గురు ఆఫీసర్లు ఉంటారని వివరించారు. ఈ ఎన్నికకు మొత్తం 1,192మంది సిబ్బందిని నియమించామని, మరో 300మందిని అదనంగా ఉంచామని తెలియజేశారు. ఇక నియోజకవర్గంలో తొలిసారిగా ఇన్‌కమ్ ట్యాక్స్‌ బృందాలు తిరుగుతున్నాయని, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ సహా 50 టీమ్‌లు రంగంలోకి దిగాయని వివరించారు. నియోజకవర్గం పరిధిలోని చెక్ పోస్టుల్లో 100 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని, రేపు సాయంత్రం 6 గంటల తర్వాత విస్తృత తనిఖీలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇక బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి నుంచి వివరణ అందిందని సీఈఓ వికాస్ రాజ్ పేర్కొన్నారు. కాగా మూడు ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది. నవంబర్ 6వ తేదీన ఫలితం వెలువడనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − four =