మునుగోడు ఉప ఎన్నిక: పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించేందుకు నాపై కుట్రలు, నన్ను ఒంటరిని చేస్తున్నారు – రేవంత్ రెడ్డి

Munugode By-poll TPCC Chief Revanth Reddy Gets Emotional During Campaign, TPCC Chief Revanth Reddy, Revanth Reddy Emotional During Campaign, Munugode By-poll TPCC Chief Revanth Reddy Campaign, Mango News, Mango News Telugu, Mango News, Mango News Telugu, Telangana Chief Bandi Sanjay Kumar, Telangna BJP Party, YSRTP , Munugode By Polls, Munugode Election Schedule Release, Munugode Election, Munugode Election Latest News And Updates, Munugode By-poll, BRS Party, Prajashanti Party

మునుగోడు ఉప ఎన్నికలో అన్ని ప్రధాన పార్టీలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇదేక్రమంలో తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ క్రమంలో పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తరపున తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముందుండి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం నల్లగొండ జిల్లా మునుగోడులో ఆయన మీడియాతో మాట్లాడారు. అయితే ఈ సమంయంలో రేవంత్ రెడ్డి కొంత భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను పీసీసీ పదవి నుంచి దింపేందుకు తెరవెనుక కొందరు కుట్రలు చేస్తున్నారని, ఈ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడం ద్వారా బలహీనపడ్డానని చూపించి తనను ఒంటరిని చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో సొంతపార్టీ నేతలు కొందరు సహకరిస్తున్నారని, కానీ కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ కార్యకర్తలే బలమని, పార్టీని కాపాడుకోవడానికి వారు ముందుకు రావాలని రేవంత్ పిలుపునిచ్చారు.

ఈ కుట్రలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు కొందరు బీజేపీ నేతలు కూడా ఉన్నారని, త్వరలోనే వారి వివరాలు బయటకు వస్తాయని రేవంత్ రెడ్డి తెలిపారు. చీకటి ఒప్పందంలో భాగంగానే టీఆర్‌ఎస్‌, బీజేపీ చేతులు కలిపాయని, సుపారీ కిల్లింగ్‌ తరహా ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్‌ను చంపేందుకు కుట్రలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడులోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవడానికి ఈ నెల 26, 27వ తేదీల్లో చండూరులో దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించిన రేవంత్ రెడ్డి, దీనికి అనుమతి ఇవ్వాల్సిందిగా ఎన్నికల కమిషన్‌ను కోరనున్నట్లు వెల్లడించారు. అలాగే జాతీయ గుర్తింపు పొందిన పార్టీలు మాత్రమే బ్యాలెట్‌ పేపర్‌లో ముందు వరుసలో ఉంటాయని, అయితే నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ లిస్ట్‌లో టీఆర్‌ఎస్‌ రెండోస్థానంలో ఉందని, దీనిపై ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − four =