9 నెలల్లో కోహెడ మార్కెట్ నిర్మాణానికి ప్రణాళిక, అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లుగా వసతులు: మంత్రి నిరంజన్ రెడ్డి

Telangana Agriculture Minister Niranjan Reddy held High Level Review on Construction of Koheda Market,Minister Niranjan Reddy, Koheda Market Construction, Koheda Market In 9 Months, Koheda As Per International Standards,Mango News,Mango News Telugu,Telangana Agriculture Minister,Telangana Agriculture Minister Niranjan Reddy,High Level Review on Koheda Market,Niranjan Reddy,Koheda Market Latest News And Updates,Minister Niranjan Reddy News And Live Updates

కోహెడ మార్కెట్ నిర్మాణంపై తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బుధవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, 9 నెలల్లో కోహెడ మార్కెట్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని, అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లుగా వసతులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. 199.13 ఎకరాలలో కొహెడ గ్లోబల్ గ్రీన్ మార్కెట్ ఉంటుందని, మొత్తం 6 లక్షల చదరపు అడుగులలో నిర్మాణాలు జరుగుతాయన్నారు. మార్కెట్ గోదాంలు, లాజిస్టిక్ పార్క్, ప్రాసెసింగ్ ప్లాంట్, వేస్ట్ మేనేజ్ మెంట్, రీ సైక్లింగ్, సోలార్ సిస్టమ్, కోల్డ్ స్టోరేజ్ గోదాంలు, రైపెనింగ్ చాంబర్లు, లేబర్, స్టాఫ్ క్వార్టర్ల నిర్మాణం జరుగుతాయని చెప్పారు.

కోహెడ మార్కెట్ లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతులకు అనుగుణంగా సదుపాయాలు ఉంటాయన్నారు. మామిడి ఎగుమతుల కోసం వేపర్ హీట్ ట్రీట్ మెంట్ ఇర్రాడియేషన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వ తరపున డైరెక్టర్ లక్ష్మీబాయి ఆహ్వానం మేరకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అగ్రికల్చర్ బోర్డ్ ఎండీ జగ్వీర్ సింగ్ యాదవ్ విచ్చేసి పలు సూచనలు చేశారని తెలిపారు. తదనుగుణంగా మార్పులు, చేర్పులు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లెందుకు నివేదిక తయారు చేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సమీక్షా సమావేశానికి వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణుడు, ఎస్ఈ రాధాకృష్ణమూర్తి, కన్సల్టెంట్ ఉమామహేశ్వర రావు, ప్రాంతీయ ఉప సంచాలకులు పద్మ హర్ష, స్పెషల్ గ్రేడ్ సెక్రెటరీ చిలుక నర్సింహారెడ్డి, డీఈఈ రవీందర్ తదితరులు హాజరయ్యారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =