సచివాలయం కూల్చివేత ఆపాలని గవర్నర్ ని కోరిన విపక్ష నేతలు

Governor asked to help stop demolition of Secretariat, Mango News, Opposition leaders meet governor narasimhan on secretariat building, Opposition Leaders Meet Governor Over Secretariat Demolition, Opposition leaders meet Governor over Telangana Secretariat, Opposition parties in Telangana meet Governor over CM KCR, Opposition seeks Governor intervention to stop razing of old structure

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవలే నూతన సచివాలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఇప్పుడు ఉన్న స్థానంలోనే కొత్త సచివాలయం, ఎర్రమంజిల్ ప్రాంతంలో కొత్త అసెంబ్లీ నిర్మాణం చేపడతామని ఇదివరకే ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రలో కీలక పార్టీలు అయిన కాంగ్రెస్, తెదేపా, సిపిఐ , భాజపా, తెలంగాణ జన సమితి ఈ నిర్ణయాన్ని మొదటినుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గతంలో సచివాలయ భవనాలను పరిశీలించి, వీటిని పడగొట్టి, కొత్తవి నిర్మించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. కాగా సోమవారం విపక్ష సభ్యులంతా గవర్నర్ నరసింహన్ ని కలిసి సచివాలయ,అసెంబ్లీ భవనాల కూల్చివేత ను అడ్డుకోవాలని వినతి పత్రం సమర్పించారు.

గవర్నర్ తనకున్న విశేషమైన అధికారాలతో, చారిత్రాత్మకమైన కట్టడాలను కాపాడాలని కోరారు, ప్రజాస్వామిక తెలంగాణ ప్రతినిధి వివేక్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కోదండరాం, కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, జానారెడ్డి, జీవన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, షబ్బీర్ అలీ, సిపిఐ నేత చాడ వెంకట్ రెడ్డి, భాజపా నాయకురాలు డీకే అరుణ, తెలంగాణ టిడిపి నాయకులు ఎల్. రమణ, రావుల చంద్రశేఖరరెడ్డి తదితరులు గవర్నర్ ని కలిశారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా, భవనాల నిర్మాణంపై దృష్టి సారించి, ప్రజలపై ఆర్ధిక భారాన్ని పెంచుతున్నారని విమర్శించారు. గవర్నర్ నరసింహన్ ఈ అంశాన్ని పరిశీలించి, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని కోరారు.

 

[subscribe]
[youtube_video videoid=hIchPc-j5ek]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 3 =