ఆర్టీసీ సమ్మె యథావిధిగా కొనసాగుతుంది – అశ్వత్థామరెడ్డి

Ashwathama Reddy Press Meet, JAC Leader Ashwathama Reddy Press Meet, Mango News Telugu, Political Updates 2019, Telangana Breaking News, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019, TSRTC JAC Leader Ashwathama Reddy Press Meet, TSRTC JAC Leader Ashwathama Reddy Press Meet On CM KCRs Decision, TSRTC JAC Leader Ashwathama Reddy Press Meet On KCR Decision

ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు నవంబర్ 23, శనివారం నాడు వివిధ కార్మిక సంఘాలతో ఎంజీబీఎస్‌లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. సమావేశమానంతరం ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ, ఆర్టీసీ జేఏసీ నిర్ణయాన్ని ఎండీకి పంపిస్తామని, ఆర్టీసీపై సీఎం కేసీఆర్‌ జరిపే సమీక్షలో కార్మికుల కోసం మంచి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని చెప్పారు. అలాగే రాష్ట్రంలో ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరణ చేసే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో కార్మికులెవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. కార్మికులను విధుల్లోకి తీసుకునే అంశంపై ప్రభుత్వ నిర్ణయం ప్రకటించిన తర్వాత భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో సమ్మె యథావిధిగా కొనసాగుతుందని అన్నారు. ఆదివారం నాడు ఎంజీబీఎస్‌ లో మహిళా ఉద్యోగులు ఉదయం నుంచే నిరసన కార్యక్రమాలు చేపడతారని ప్రకటించారు.

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 10 =