నాందేడ్‌లో బీఆర్‌ఎస్‌ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌, నేతలకు దిశానిర్దేశం

CM KCR Attends BRS Two-Day Training Camp in Nanded Maharashtra Today and Gives Guidance For The Cadre,CM KCR Attends BRS Two-Day Training Camp,BRS Camp in Nanded Maharashtra Today,CM KCR Gives Guidance For The Cadre,BRS Two-Day Training Camp,Mango News,Mango News Telugu,BRS Training Camps From Today In Nanded,CM KCR TO Reach Maharashtra,BRS Chief and CM KCR,BRS Training Camp Latest News,BRS Training Camp Latest Updates,CM KCR Latest News,CM KCR News And Live Updates,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,BRS Maharashtra News Today

మహారాష్ట్రలోని నాందేడ్‌లో బీఆర్‌ఎస్‌ శిక్షణ శిబిరాన్ని పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శుక్రవారం ప్రారంభించారు. కాగా తెలంగాణ వెలుపల బీఆర్‌ఎస్‌ నిర్వహిస్తున్న తొలి శిక్షణ శిబిరం ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. నేటినుంచి రెండు రోజులపాటు జరిగే ఈ శిక్షణా శిబిరానికి మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన కన్వీనర్‌, సమన్వయకర్త, మహిళా విభాగం కన్వీనర్‌, రైతు విభాగం కన్వీనర్‌, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీ, మున్సిపల్‌ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు. నాందేడ్‌లోని అనంత్‌లాన్స్‌ వేదికపైకి చేరుకున్న సీఎం కేసీఆర్ ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం హాజరైన మహారాష్ట్ర బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నా.. నేటికీ ప్రజలందరికీ కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేని స్థితిలో ప్రభుత్వాలు ఉంటున్నాయని పేర్కొన్నారు. దీనికి కారణం గత పాలకులేనని, దేశం భవిష్యత్తు మారాలంటే కొత్త నాయకత్వం రావాలని, ప్రజలకు సేవ చేసే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు కాదని, ప్రజలు అని పేర్కొన్న కేసీఆర్.. ఇటీవలి కర్ణాటక ఫలితాలపై పరోక్షంగా వైఖ్యానించారు. దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఒక్క రాష్ట్రంలో గెలిచినందుకే సంబరాలు చేసుకుంటుందని, ఇప్పటి ఆ పార్టీ దుస్థితికి గతంలో అనుసరించిన విధానాలే కారణమని చెప్పారు. దేశంలో కావాల్సినంత సాగు నీరు, త్రాగు నీరు ఉందని, కానీ సరైన ప్రణాళికలు లేకపోవడంతో సద్వినియోగం చేసుకోలేకపోతున్నామని, వృథాగా వేల టీఎంసీల న్నేరు సముద్రంలో కలుస్తోందని తెలిపారు. దీనిని సరిగా వినియోగించుకోగలిగితే దేశంలో ఒక్క రైతు కూడా ఆత్మహత్యకు పాల్పడాల్సిన దుస్థితి ఉండదని, రైతులు సంఘటితంగా ఒక్క మాటపై నిలబడి వచ్చే ఎన్నికల్లో రైతు రాజ్యాన్ని స్థాపించడం కోసం పాటుపడుతున్న బీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించాలని సీఎం కేసీఆర్ కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here