మరియమ్మ లాకప్ డెత్ కేసు : ఎస్ఐ సహా ఇద్దరు కానిస్టేబుళ్లు సర్వీస్‌ నుంచి తొలగింపు

Custodial death of Dalit woman, Justice sought in lockup death case, KCR orders probe into Mariamma lock-up death case, Mango News, Mariamma Demise, Mariamma Demise Case, mariamma lockup death, Mariamma Lockup Death Case, Rachakonda CP, Rachakonda CP Mahesh Bhagwat, Rachakonda CP Mahesh Bhagwat Issued Orders on Dismissal, Rachakonda CP Mahesh Bhagwat Issued Orders on Dismissal of 3 Police Officers in Mariamma Demise Case, Telangana custodial death

తెలంగాణ రాష్ట్రంలో దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అనంతరం ఈ ఘటనకు కారణమైన పోలీసులపై తక్షణమే విచారణ జరిపి, నిజనిర్ధారణ చేసి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వారిని ఉద్యోగంలో నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మరియమ్మ లాకప్‌ డెత్ కేసులో బాధ్యులైన ఎస్ఐ సహా ఇద్దరు కానిస్టేబుళ్లపై తెలంగాణ పోలీస్‌శాఖ చర్యలు తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడురు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించిన ఎస్ఐ మహేష్, కానిస్టేబుళ్లు ఎంఏ రషీద్, పీ జానయ్యను సర్వీస్‌ నుంచి తొలగిస్తూ రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్‌ భగవత్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో వీరూ ఇప్పటికే సస్పెన్షన్ లో ఉండగా, విచారణ అనంతరం తాజాగా విధుల నుంచి పూర్తిగా తొలగిస్తునట్టు ఆదేశాలు ఇచ్చారు. అలాగే సస్పెన్షన్ ఆదేశాలు జూలై 20, మంగళవారం నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + nineteen =