భద్రాద్రిలో రాములవారి కల్యాణమహోత్సవం, ప‌ట్టువస్త్రాలు స‌మ‌ర్పించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

2021 Sri Rama Navami, bhadrachalam, Bhadrachalam Sri Rama Navami Celebrations, Mango News, Minister Indrakaran Reddy, Sri Rama Navami, Sri Rama Navami 2021, Sri Rama Navami Celebrations, Sri Rama Navami Celebrations in Bhadrachalam, Sri Rama Navami Celebrations In Telangana, Sri Rama Navami Greetings, Sri Rama Navami In telangana, Sri Rama Navami News, telangana, Telangana Endowments Minister Indrakaran Reddy

రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలను నిరాండంబరంగా నిర్వహించనున్నామని, భక్తులను అనుమతించడం లేదని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రకటించించిన సంగతి తెలిసిందే. శ్రీరామనవమి సందర్భంగా బుధవారం ఉదయం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో రాములవారి కల్యాణమహోత్సవం కన్నులపండుగగా జరిగింది. కొద్దీ మంది అథితుల‌తోనే కోవెల ప్రాంగణంలో స్వామి వారి కళ్యాణోత్సవ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధులుగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మరియు ఖమ్మం జిల్లాకు చెందిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఈ వేడుకులకు హాజరయ్యారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించగా, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముత్యాల తలంబ్రాలు అందజేశారు. వేదపండితులు, అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ప్రతినిధులు, కొద్దిమంది మంది అథితుల సమక్షంలోనే రాములవారి కల్యాణాన్ని నిర్వహించారు. ఇక శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా ఏప్రిల్ 22, గురువారం నాడు శ్రీరామ మహాపట్టాభిషేకం నిర్వహించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − 1 =