హైదరాబాద్ నగరంలో 700 బృందాలతో 47582 ఇళ్లలో ఫీవర్ సర్వే

700 Teams Conducted Fever Survey at 47582 Houses in GHMC Area Today,Mango News,Mango News Telugu,GHMC,Telangana COVID-19 Report,Covid-19 Updates In Telangana,Telangana COVID-19 Cases,COVID 19 Updates,COVID-19,COVID-19 Latest Updates In Telangana,Telangana,Telangana Coronavirus Updates,COVID-19 Cases In Telangana,Telangana Corona Updates,COVID-19 In Telangana,Telangana COVID Reports Latest,Fever Survey Taken Up In Hyderabad,Fever Survey,47582 Households Screened In Hyderabad,47582 Houses Surveyed For Fever In Hyderabad,GHMC Fever Survey Covers 41305 Households,GHMC Fever Survey

కోవిడ్ నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాద్ లో చేపట్టిన ఫీవర్ సర్వేలో భాగంగా గురువారం నాడు 47,582 ఇళ్లలో సర్వే నిర్వహించారు. జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖలకు చెందిన 700 బృందాలు నేడు ఇంటింటికి తిరిగి జ్వరం, కోవిడ్ లక్షణాలున్నవారి సర్వేను పెద్ద ఎత్తున చేపట్టాయి. ఒక్కో బృందంలో ఒక ఏ.ఎన్.ఎం, ఆశ వర్కర్, జీహెచ్ఎంసీ వర్కర్ తో కూడిన సభ్యులు ఇంటింటికి తిరిగి సర్వేను చేపట్టారు. ఈ బృందాలు జ్వరంతో ఉన్న వారి వివరాలను సేకరించి వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటుగా జ్వరం కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది ఆంటీ లార్వా ద్రావకాన్ని పిచికారి చేస్తున్నారు.

నగరంలో ప్రతీ బస్తీ దవాఖానా, అర్బన్ హెల్త్ సెంటర్లు, ఇతర దవాఖానాలలో కోవిడ్ అవుట్ పేషంట్ కు పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించడంతో నేడు కూడా అన్ని ఆసుపత్రుల్లో18,765 మందికి జ్వర పరీక్షలు నిర్వహించారు. అలాగే జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ ద్వారా 130 మందికి కోవిడ్ సంబంధిత సలహాలు, సూచనలను వైద్యులు అందజేసినట్టు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =