స్వతంత్ర భారత వజ్రోత్సవాలు: ఆగస్టు 16న రాష్ట్రవ్యాప్తంగా “సామూహిక జాతీయ గీతం ఆలాపన” కార్యక్రమం

Swatantra Bharata Vajrotsavalu Program of Mass Singing of National Anthem Across the State is Scheduled on August 16, Program of Mass Singing of National Anthem Across the State is Scheduled on August 16, Telangana Swatantra Bharata Vajrotsavalu, Swatantra Bharata Vajrotsavalu, Mass Singing of National Anthem, National Anthem singing across Telangana, Diamond Jubilee Celebrations, Azadi ka Amrit Mahotsavam, National Anthem, Swatantra Bharata Vajrotsavalu News, Swatantra Bharata Vajrotsavalu Latest News, Swatantra Bharata Vajrotsavalu Latest Updates, Swatantra Bharata Vajrotsavalu Live Updates, 75th Independence Day, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకలలో భాగంగా సామూహిక జాతీయ గీతం ఆలాపన (జాతీయ గీతాన్ని సామూహికంగా ఆలపించడం) కార్యక్రమాన్ని ఆగస్టు 16, మంగళవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాలు, స్థానిక మున్సిపల్ వార్డులు, ముఖ్యమైన ప్రధాన జంక్షన్లు, ట్రాఫిక్ జంక్షన్లు, పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, జైళ్లు, కార్యాలయాలు, మార్కెట్ స్థలాలు, గుర్తించిన ఇతర ప్రదేశాలలో ఆగస్టు 16, మంగళవారం ఉదయం 11.30 గంటలకు సామూహికంగా జాతీయ గీతాన్ని ఆలపించాలని సీఎస్ పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌లు, పోలీసు కమిషనర్లు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సీఎస్ సూచించారు. సంబంధిత గ్రామ పంచాయతీలలో, స్థానిక మున్సిపల్ వార్డులు, ట్రాఫిక్ జంక్షన్‌లలో జాతీయ గీతం సామూహిక ఆలాపన కోసం ప్రజలు గుమిగూడే ప్రదేశాలను గుర్తించి తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఆయా ప్రదేశాలలో నోడల్ అధికారులను నియమించి, మైక్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి స్థానికంగా విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఆగస్టు 16 ఉదయం 11.30 గంటలకు ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొనాలని , జాతీయ గీతం ఆలపించే సమయంలో ఎటువంటి శబ్దాలు లేకుండా, అత్యంత క్రమశిక్షణతో జాతీయ గీతం ఆలపించాలని సీఎస్ సోమేశ్ కుమార్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × five =