హైదరాబాద్ చేరుకున్న టీ-కాంగ్రెస్‌ నూతన ఇన్‌చార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే.. గాంధీ భవన్‌లో పలువురు నేతలతో కీలక భేటీ

T-Congress New Incharge Manik Rao Thackeray Arrives at Gandhi Bhavan Today Held Key Meet with Several Party Leaders,Manickam Tagore,Manikrao Thakre,Manickam Tagore Resigned,Manikrao Thakre New Incharge For T-Congress,T-Congress,AICC Appoints Manikrao Thakre,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల నూతన ఇన్‌చార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే రెండు రోజుల పర్యటన కోసం హైదరాబాద్ చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు స్వీకరించాక ఆయన రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా మాణిక్‌రావు ఠాక్రేను కలుసుకోవడానికి పెద్దఎత్తున గాంధీభవన్‌కు వచ్చారు. ఇక అంతకుముందు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ వీహెచ్ సహా ఇతర కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం మాణిక్‌రావు ఠాక్రే అక్కడ నుంచి నేరుగా గాంధీభవన్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో గాంధీభవన్‌ వద్ద ఆయనకు ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, రోహిత్ చౌదరి తదితరులు సాదర స్వాగతం పలికారు.

ఈ నేపథ్యంలో మాణిక్‌రావు ఠాక్రే గాంధీభవన్‌లో ముఖ్యనేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. రేవంత్‌‌ రెడ్డి, భట్టి విక్రమార్క, మధుయాష్కీ గౌడ్, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌‌కుమార్‌ రెడ్డి, శ్రీధర్‌ బాబులతో విడివిడిగా భేటీ అయ్యారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు పీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. అలాగే రేపు డీసీసీలు, ఆఫీస్ బేరర్లు, అనుబంధ సంఘాల చైర్మన్‌లు మరియు అధికార ప్రతినిధులతో మాణిక్‌రావు ఠాక్రే చర్చించనున్నారు. మరోవైపు ఈనెల 26 నుంచి హాత్‌ సే హాత్‌ జోడో యాత్రలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రేవంత్‌ రెడ్డి పాదయాత్రపైన కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే భువనగిరి ఎంపీ ఎంపీ కోమటిరెడ్డి మాత్రం ఈ భేటీకి హాజరు కాలేదు. ఆయనకు పిలుపు అందినా.. గాంధీ భవన్‌కు రాలేనని, బయట కలుస్తానని ఠాక్రేకు తెలియజేశారని సమాచారం. కాగా ఇటీవలే ఏఐసీసీ మాణిక్యం ఠాగూర్‌ స్థానంలో మాణిక్‌రావు ఠాక్రేను నూతన ఇన్‌చార్జిగా నియమించిన సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here