సెప్టెంబర్ 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Mango News Telugu, Telangana Assembly 2019, Telangana Assembly Budget Session, Telangana Assembly Budget Session 2019, Telangana Assembly Budget Session To Start, Telangana Assembly Budget Session To Start From September 9, Telangana Assembly Session, Telangana Assembly Session 2019, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019

తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసన మండలి బడ్జెట్ సమావేశాలు సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్నాయి. శాసనసభ కార్యదర్శి బడ్జెట్ సమావేశాలపై ఆదివారం నాడు నోటిఫికేషన్ జారీ చేసారు. సమావేశాలు ప్రారంభమయిన రోజునే రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆర్థిక శాఖ మంత్రిగా కూడ బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే బడ్జెట్ పై పూర్తిస్థాయిలో కసరత్తు చేసారు. శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ ప్రవేశపెడతారు, శాసనమండలిలో మరో మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సెప్టెంబర్ 10న మొహర్రం సెలవుకాగా, 11వ తేదినుండి బడ్జెట్ పై చర్చజరిగే అవకాశం ఉంది.

గత ఫిబ్రవరిలో తెలంగాణ ప్రభుత్వం ఓట్-ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది, అయితే 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను పూర్తిస్థాయిలో బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం దానిపై నిర్వహించే చర్చకు ఎక్కువ రోజులు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే సమావేశాలకు సంబంధించిన ఎజెండా, సభ నిర్వహణ రోజులను బీఏసీ సమావేశంలో ఖరారు చేయనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు ప్రభుత్వం పై అనేక అంశాలపై విమర్శలు గుప్పిస్తూ ఉండడంతో ఈసారి జరిగే బడ్జెట్ సమావేశాలు వాడిగా, వేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

[subscribe]
[youtube_video videoid=dptggwgjOvE]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − eleven =