ఈటలను కౌశిక్ రెడ్డి ఎదుర్కోగలరా?.. కేసీఆర్ వ్యూహాలు ఫలిస్తాయా?

Can Kaushik Reddy Face the Spears Will Kcrs Strategies Work,Can Kaushik Reddy Face the Spears,Will Kcrs Strategies Work,Huzurabad, Adi Kaushik Reddy, Eetela Rajender, Telangana Assembly Elections, Telangana Politics,Mango News,Mango News Telugu,Kaushik Reddy Latest News,Kaushik Reddy Latest Updates,Kcrs Strategies Latest News,Kcrs Strategies Latest Updates,Telangana Assembly Elections Latest News,Telangana Assembly Elections Latest Updates
huzurabad, [adi kaushik reddy, eetela rajender, telangana assembly elections, telangana politics

తెలంగాణలో ఎన్నికలపోరు రసవత్తరంగా కొనసాగుతోంది. అన్ని పార్టీలు ఎన్నికల గేమ్‌లోకి దిగేశాయి. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఎన్నికలకు నెల రోజుల సమయం కూడా లేకపోవడంతో.. ఇంటింటి ప్రచారాలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ.. నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఈసారి హుజురాబాద్ నియోజకవర్గంపై ఉత్కంఠ పెరిగిపోతోంది. ఆ స్థానంలో ఏ జెండా ఎగరబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

బీజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పోటీ చేస్తుంటే.. ఆయనకు పోటీగా బీఆర్ఎస్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి రంగలోకి దిగుతున్నారు. ముందు నుంచి కూడా హుజురాబాద్ బీఆర్ఎస్‌కు కంచుకోట. 2004 నుంచి అక్కడ గులాబి జెండానే ఎగురుతోంది. కేప్టెన్ లక్ష్మీకాంత రావు 2004, 2008లో బీఆర్ఎస్ తరుపున హుజురాబాద్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2009లో ఈటల రాజేందర్ అక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి నుంచి హుజురాబాద్‌ను తన సిట్టింగ్ స్థానంగా మార్చుకున్నారు.

2014, 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుపున హుజురాబాద్ నుంచి గెలుపొంది ఈటల హ్యాట్రిక్ కొట్టారు. ఆ తర్వాత పార్టీలో ఇంటర్నల్ సమస్యల వల్ల ఈటల బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి.. కాషాయపు కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ తరుపున ఈటల రాజేందర్ విజయకేతనం ఎగురవేశారు. ఇప్పుడు ఐదోసారి హుజురాబాద్ నుంచి గెలుపొందాలని ఈటల ఉవ్విళ్లూరుతున్నారు. ఆయన గెలుపు అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ఆయనకు ఉన్న సానుకూలత, ప్రజల్లో ఉన్న నమ్మకంతో మరోసారి ఈటల హుజురాబాద్ గడ్డపై గెలుపొందడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అటు పాడి కౌశిక్ రెడ్డి కూడా దమ్మున్న నేత. 2019 ఎన్నిక్కల్లో హుజురాబాద్ నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేసి ఈటల చేతిలో ఓటమిపాలయ్యారు. ఈటల బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పాక.. కౌశిక్ రెడ్డి గులాబీ పార్టీలో చేరిపోయారు. ఆ తర్వాత కేసీఆర్.. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. అయితే ఈసారి  ఎలాగైనా ఈటలను ఓడించాలని కేసీఆర్ పావులు కదుపుతున్నారు. సరికొత్త వ్యూహాలను రచిస్తున్నారు. ఈటలకు పోటీగా పాడి కౌశిక్ రెడ్డిని బరిలోకి దింపారు. ఈటలను ఓడించేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలడం లేదు. మరి ఈటలను కౌశిక్ రెడ్డి ఎదుర్కోగలరా? కేసీఆర్ వ్యూహాలు ఫలిస్తాయా? ఈసారి హుజురాబాద్‌లో గెలవబోయేది ఎవరు? అనేది చర్చనీయాంశంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 2 =