మాజీ గవర్నర్‌కు షాక్ ఇచ్చిన బీజేపీ అధిష్టానం

BJPs Fourth List with 12 Candidates,BJPs Fourth List,BJP list with 12 candidates,BJP, BJP Candidates list, BJP Candidates Fourth List, Telangana Assembly Elections,Mango News,Mango News Telugu,Telangana elections,BJP Releases Fourth List,Telangana Assembly Polls,Telangana Elections Latest News,Telangana Elections Latest Updates,Telangana Elections Live News,BJP Fourth List Latest News,BJP Fourth List Latest Updates,BJP Fourth List Live News
bjp, bjp candidates list, bjp candidates fourth list, telangana assembly elections

తెలంగాణలో రాజకీయాలు పీక్స్‌కు చేరుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రాజకీయ పార్టీలన్నీ విడతల వారీగా తమ అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ దాదాపు తమ అభ్యర్థులను ప్రకటించగా.. అటు కాంగ్రెస్ 116 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇక బీజేపీ కూడా విడతల వారీగా తమ అభ్యర్థలను ప్రకటిస్తోంది. ఇప్పటి వరకు మూడు విడతల్లో తమ అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా నాలుగో విడత అభ్యర్థుల జాబితాను కూడా బీజేపీ ప్రకటించేసింది. ఈ విడతలో 12 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.

ఇప్పటి వరకు బీజేపీ మొత్తం 100 స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 19 స్థానాలను పెండింగ్‌లో పెట్టింది.  అందులో 7 స్థానాలను జనసేనకు ఇచ్చే యోచనలో బీజేపీ ఉందట. అయితే శేరిలింగంపల్లి స్థానాన్ని తమకే కేటాయించాలని జనసేనాని కోరుతున్నారట. కానీ ఆ స్థానాన్ని తన అనుచరుడికి కేటాయించాలని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అధిష్టానం వద్ద పట్టుపట్టుకొని కూర్చున్నారట. ఈక్రమంలో ఆ స్థానం ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.

ఇక నాలుగో విడతలో.. సిద్ధిపేట టికెట్‌ను దూది శ్రీకాంత్ రెడ్డికి.. చెన్నూరు టికెట్ దుర్గం అశోక్‌కి.. వికారాబాద్ టికెట్‌ను పెద్దింటి నవీన్ కుమార్‌కు.. ఎల్లారెడ్డి టికెట్‌ను సుభాష్ రెడ్డికి.. వేములవాడ టికెట్‌ను తుల ఉమకు అధిష్టానం కేటాయించింది. అలాగే హుస్నా బాద్ టికెట్‌ను బొమ్మ శ్రీరాం చక్రవర్తికి.. మిర్యాలగూడ టికెట్‌ను సాధినేని శివకి.. కొడంగల్ టికెట్‌ను బంటు రమేశ్‌ కుమార్‌కి.. ములుగు టికెట్‌ను అజ్మీరా ప్రహ్లాద్ నాయక్‌కు.. మునుగోడు టికెట్‌ను చల్లమల్ల కృష్ణారెడ్డికి.. గద్వాల్ టికెట్‌ను బోయ శివ.. నకిరికేట్ టికెట్‌ను మొగులయ్యకు కట్టబెట్టింది.

అయితే మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు.. కుమారుడు వికాస్ రావుకు అధిష్టానం గట్టి షాక్ ఇచ్చింది. వేములవాడ టికెట్ తనకే దక్కుతుందని వికాస్ రావు ఆశించారు. అధిష్టానంపై నమ్మకంతో నియోజకవర్గంలో ప్రచారం కూడా మొదలు పెట్టారు. కానీ చివరికొచ్చే సరికి బీజేపీ అధిష్టానం ఆయనకు మొండి చేయి చూపింది. వికాస్ రావును కాదని వేముల వాడ టికెట్‌ను.. తుమ ఉమకు కేటాయించింది. దీంతో వికాస్ రావు  అధిష్టానం పట్ల ఆగ్రహంగా ఉన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − seven =