వ్యవసాయంలో యాంత్రీకరణకు ప్రోత్సాహం, శక్తిమాన్ ఇండస్ట్రీని సందర్శించిన మంత్రి నిరంజన్ రెడ్డి

Telangana Agriculture Minister Niranjan Reddy Visits Shaktiman Industry at Rajkot Gujarat, Agriculture Minister Niranjan Reddy Visits Shaktiman Industry at Rajkot Gujarat, Minister Niranjan Reddy Visits Shaktiman Industry at Rajkot Gujarat, Niranjan Reddy Visits Shaktiman Industry at Rajkot Gujarat, Gujarat Shaktiman Industry, Shaktiman Industry, Niranjan Reddy Visits Shaktiman Industry, Telangana Agriculture Minister Niranjan Reddy, Agriculture Minister Niranjan Reddy, Minister Niranjan Reddy, Telangana Agriculture Minister, Niranjan Reddy, promote mechanization in agriculture sector, Minister Niranjan Reddy News, Minister Niranjan Reddy Latest News, Minister Niranjan Reddy Latest Updates, Minister Niranjan Reddy Live Updates, Mango News, Mango News Telugu,

వ్యవసాయ రంగంలో యాంత్రీకరణను ప్రోత్సహించే క్రమంలో భాగంగా గురువారం నాడు గుజరాత్ రాజ్ కోట్ లోని శక్తిమాన్ ఇండస్ట్రీని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సందర్శించారు. మంత్రితో వెళ్లిన బృందంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, అగ్రోస్ ఎండీ రాములు, అగ్రోస్ జీఎం రాజమౌళి, తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, “వ్యవసాయంలో యాంత్రీకరణకు ప్రోత్సాహం అందిస్తాం. సాగునీటి రాకతో తెలంగాణ కూలీలంతా రైతులుగా మారారు. క్షేత్రస్థాయిలో కూలీల కొరత తీవ్రంగా ఉంది. గత ఏడేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి దేశంలోని 11 రాష్ట్రాల నుండి వచ్చి వ్యవసాయ కూలీలుగా, వ్యవసాయ అనుబంధ రంగాలలో కూలీలుగా పనిచేస్తున్నారు. యూపీ, బీహార్, ఛత్తీస్ ఘడ్, ఒడిశా రాష్ట్రాల నుండి కూలీల రాక ఎక్కువగా ఉన్నది. వ్యవసాయంలో వీలయినంత తొందరగా రైతాంగాన్ని యాంత్రీకరణ వైపు మళ్లించాల్సిన ఆవశ్యకత ఉంది. మన దేశంలో చిన్న కమతాలకు అనుగుణంగా యాంత్రీకరణను ప్రోత్సహించాలి. అభివృద్ధి చెందిన దేశాలలో పెద్ద కమతాలకు అనుగుణంగా తయారు చేసుకున్న యంత్రాలు మన రైతాంగానికి ఉపయోగపడే పరిస్థితి లేదు” అని అన్నారు

“గత ఎనిమిదేళ్లలో తెలంగాణలో దాదాపు 80 లక్షల ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చింది. అనూహ్య పరిణామాల నేపథ్యంలో రైతాంగాన్ని వేగంగా పంటల వైవిద్యీకరణతో పాటు యాంత్రీకరణ వైపు మళ్లించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. అందులో భాగంగా గుజరాత్ రాష్ట్రంలోని రాజ్ కోట్ లో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో వ్యవసాయ పరికరాలు తయారుచేస్తున్న శక్తిమాన్ ఇండస్ట్రీని సందర్శించాం. అలాగే ఈ పర్యటనలో భాగంగా ఆదర్శ వ్యవసాయ మార్కెట్ కమిటీ గోండల్ లో నిర్వహిస్తున్న వేరుశెనగ ప్రాసెసింగ్ యూనిట్ ను సందర్శించాం. తెలంగాణలో వేరుశెనగ విస్తృతంగా సాగు చేస్తున్న నేపథ్యంలో వేరుశెనగ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నాం. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో, రోబోటిక్ టెక్నాలజీతో వ్యవసాయ పరికరాలు తయారు చేస్తున్న శక్తిమాన్ కంపెనీ తెలంగాణలో యూనిట్ నెలకొల్పాలని ఆహ్వానించాం. ప్రభుత్వపరంగా భూమి కేటాయింపు, అన్ని రకాల అనుమతులు, ఇతర సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చాము” అని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. అంతకుముందు మంత్రి నేతృత్వంలోని బృందం ప్రముఖ జ్యోతిర్లిగం సోమనాథ్ ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × four =