తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీలు

Transfers of IAS in Telangana,Transfers of IAS,IAS Transfers in Telangana,Amrapali IAS, Telangana Government, CM Revanth reddy, HMDA,Mango News,Mango News Telugu,Govt transfers 8 IAS officers,Seven IAS officers get new postings,Eight IAS officers transferred,Transfers several IAS and IPS officers,Telangana IAS Transfers Latest News,Telangana IAS Transfers Latest Updates,Telangana IAS Transfers Live News,CM Revanth Reddy Latest News,Telangana Latest News And Updates,Telangana Politics
Amrapali IAS, Telangana Government, CM Revanth reddy, HMDA

ఇప్పటికే దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మరింత దూకుడు పెంచారు. ఇటీవల ఒకేసారి మూడు కమిషనరేట్లకు ఐపీఎస్ అధికారులను రేవంత్ రెడ్డి బదిలీ చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలుగా డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్లను నియమించారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో పలువురు ఐపీఎస్‌లను బదిలీ చేశారు. మరికొందరిని కొత్తగా నియమించారు. తెలంగాణలో దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత కీలకమైన విద్యుత్ సంస్థలకు సీఎండీలుగా ఐఏఎస్‌ అధికారులను నియమించారు.

డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలి అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన ఆమ్రపాలి రాష్ట్ర విభజన తర్వాత వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల కలెక్టర్‌గా పని చేశారు. ఆ సమయంలోనే ఆమెకు మంచి గుర్తింపు లభించింది. 2020లో ఆమ్రపాలికి పీఎంవో నుంచి పిలుపు రావడంతో ఢిల్లీకి వెళ్లారు. పీఎంవో‌లో డిప్యూటీ కార్యదర్శిగా పని చేశారు. అయితే అక్కడ డిప్యూటీ పూర్తి కావడంతో ఆమ్రపాలి తిరిగి తెలంగాణకు వచ్చారు.

ఇక తెలంగాణ ప్రభుత్వం ఆమ్రపాలిని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా నియమమించింది. అలాగే మూసీ అభివృద్ధి సంస్థ ఇంఛార్జీ ఎండీగా కూడా ఆమెకు బాధ్యతలు అప్పగించింది. కేంద్ర సర్వీసుల నుంచి తిరిగి వచ్చిన ఆమ్రపాలి ఇటీవలే రేవంత్ రెడ్డిని కలిశారు. అయితే అత్యంత కీలకమైన హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ జాయింట్ కమిషనర్‌గా ఆమ్రపాలిని నియమించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అలాగే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీని తెలంగాణ ప్రభుత్వం ఇంధన శాఖ కార్యదర్శిగా, ట్రాన్స్ కో, జెన్ కో సంస్థలకు సీఎండీగా నియమించింది. రిజ్వీకి గతంలో ట్రాన్స్ కో సీఎండీగా పనిచేసిన అనుభవం ఉంది. తెలంగాణలో విద్యుత్ పదవుల్లో పనిచేసిన చివరి ఐఏఎస్ ఆయనే. ట్రాన్స్‌కో, ఎస్‌పీడీసీఎల్ సీఎండీగా పనిచేసిన అనుభవం ఉండడంతో పాటు ఎలక్ట్రిక్ ఇంజినీరింగ్ పట్టభద్రుడు కావడంతో రిజ్వీకి తెలంగాణ ప్రభుత్వం ఈ బాధ్యతలు అప్పగించింది.

ఇక ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా సందీప్ కుమార్ ఝాను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శిగా పని చేస్తున్నారు. అలాగే టీఎస్‌ఎస్పీడీసీఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ముషారఫ్ అలీ నియమితులయ్యారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + ten =