రూ.2,30,825.96 కోట్లతో తెలంగాణ రాష్ట్ర 2021-22 బడ్జెట్‌

2021 Telangana Assembly Budget Session, Budget Session, Mango News, Telangana Assembly, Telangana Assembly Budget Session, Telangana Assembly Budget Session 2021, Telangana Assembly Budget Sessions, Telangana Assembly Session, Telangana Budget 2021-22, Telangana Budget 2021-22 Live, Telangana Budget 2021-22 Live Updates, Telangana Budget 2021-22 Updates, Telangana Budget Assembly session, Telangana budget session, Telangana Budget Session 2021-2022

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. సమావేశాల్లో భాగంగా నాలుగో రోజైన గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థికమంత్రి టి.హరీశ్‌రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.2,30,825.96 కోట్ల అంచనాతో ఈ బడ్జెట్‌ను రూపొందించారు.

బడ్జెట్‌ ప్రసంగంలో ముఖ్యాంశాలు:

  • వైద్యఆరోగ్య శాఖకు రూ.6295 కోట్లు కేటాయింపు.
  • పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖకు రూ.29,271 కోట్లు
  • విద్యుత్ రంగానికి రూ.11046 కోట్లు
  • ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌కు రూ.3,077 కోట్లు
  • ఐటీ రంగానికి రూ.360 కోట్లు
  • అటవీ శాఖకు రూ.1276 కోట్లు
  • రోడ్లు భవనాల శాఖకు రూ.8788 కోట్లు
  • హోమ్ శాఖకు రూ.6465 కోట్లు
  • పౌరసరఫరాల శాఖకు రూ.2363 కోట్లు
  • సాంస్కృతిక పర్యాటక రంగాలకు రూ.726 కోట్లు
  • దేవాదాయశాఖకు రూ.720 కోట్లు
  • పశు సంవర్ధక, మత్స్య శాఖకు 1730 కోట్లు
  • సాగునీటి రంగానికి రూ.16931 కోట్లు కేటాయింపు
  • వ్యవసాయ రంగానికి రూ.25 వేల కోట్లు
  • పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధికి రూ. 15,030 కోట్లు
  • బీసీ సంక్షేమ శాఖ‌కు రూ.5,522 కోట్లు
  • మ‌హిళా, శిశు సంక్షేమం కోసం రూ. 1,702 కోట్లు
  • విద్యారంగ అభివృద్ధికి రూ.4000 కోట్లతో సరికొత్త విద్యా పథకం ప్రతిపాదన, ఈ సంవత్సరం 2 వేల కోట్ల నిధుల ఖర్చు.
  • పాఠశాల విద్యకు రూ.11735 కోట్లు
  • ఉన్నత విద్యారంగానికి రూ.1873 కోట్లు
  • రైతు బంధు కోసం – రూ.14 ,800 కోట్లు
  • రైతుల రుణమాఫీ కోసం రూ.5225 కోట్లు కేటాయింపు
  • రైతు భీమా పథకం కోసం: రూ.1200 కోట్లు
  • రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే కోసం రూ.400 కోట్లు
  • ఆసరా పెన్షన్స్ కోసం రూ.11,728 కోట్లు
  • కళ్యాణలక్ష్మి/షాదీ ముబారక్ పథకం కోసం రూ.2750 కోట్లు కేటాయింపు
  • ఎస్సీల ప్ర‌త్యేక ప్ర‌గ‌తి నిధి కోసం రూ. 21,306.85 కోట్లు
  • ఎస్టీల ప్ర‌త్యేక ప్ర‌గ‌తి నిధి కోసం రూ. 12,304. 23 కోట్లు
  • డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం రూ.11 వేల కోట్లు కేటాయింపు
  • వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్‌కు రూ.250 కోట్లు కేటాయింపు.
  • ఖ‌మ్మం కార్పొరేష‌న్‌కు రూ.150 కోట్లు కేటాయింపు
  • రూ.1000 కోట్లతో సీఎం ద‌ళిత్ ఎంప‌వ‌ర్‌మెంట్ ప్రోగ్రాం
  • రెవెన్యూ వ్యయం – రూ.1, 69, 383.44 కోట్లు
  • రెవెన్యూ మిగులు – రూ.6, 743.50 కోట్లు
  • పెట్టుబడి వ్యయం – రూ.29.046.77 కోట్లు
  • ఆర్థిక లోటు – రూ.45,509.60 కోట్లు
  • రాష్ట్రంలో రైతులకు ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాలకు సంబంధించిన యాంత్రీకరణ ప్రోత్సహించేందుకు రూ.1500 కోట్లు కేటాయింపు
  • రాష్ట్రంలో రైతులకు ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ యంత్రాలకు సంబంధించిన యాంత్రీకరణ ప్రోత్సహించేందుకు రూ.1500 కోట్లు కేటాయింపు
  • నూతన సచివాలయం నిర్మాణం కోసం రూ.610 కోట్లు
  • ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.5 కోట్లు, బడ్జెట్ లో మొత్తం రూ.800 కోట్లు కేటాయింపు
  • టీఎస్ ఆర్టీసీకి రూ.1500 కోట్లు
  • ఎస్టీ గృహాలపై రాయితీపై విద్యుత్ అందించడానికి రూ.18 కోట్లు
  • బీటీ రోడ్లు సౌకర్యం లేని ఎస్టీ నివాస సముదాయాలకు (హాబిటేషన్లకు) రూ.165 కోట్లు కేటాయింపు
  • చేనేత కార్మికుల సంక్షేమం కోసం రూ.338 కోట్లు
  • నాయిబ్రాహ్మణుల సెలూన్లకు ప్రభుత్వం రాయితీతో విద్యుత్
  • వచ్చే రెండు సంవత్సరాల్లో ఆధునిక సెలూన్ల ఏర్పాటుకు ఆర్ధిక సాయం చేయాలని ప్రభుత్వ నిర్ణయం
  • రజకుల కోసం అధునాతన వసతులతో ధోబీఘాట్స్ నిర్మాణం
  • కల్లు-గీత కార్మికుల సంక్షేమం కోసం రూ.25 కోట్లు
  • గొల్ల కుర్మలకు రూ.3000 కోట్లతో మరో మూడు లక్షల యూనిట్ల గొర్రె పిల్లలు పంపిణి చేయని నిర్ణయం
  • బీసీ కార్పొరేష‌న్‌, అత్యంత వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల కార్పొరేష‌న్‌కు రూ. 1000 కోట్లు
  • మైనార్టీ గురుకులాల నిర్వ‌హ‌ణ‌కు రూ.561 కోట్లు
  • మైనార్టీ సంక్షేమానికి రూ.1,606 కోట్లు
  • మ‌హిళా స్వ‌యం స‌హాయ‌క సంఘాల‌కు వ‌డ్డీ లేని రుణాల కోసం రూ.3 వేల కోట్లు
  • షీ టాయిలెట్లు నిర్మించేందుకు రూ.10 కోట్లు
  • పట్టణాల్లో సమీకృత వెజ్-నాన్ వెజ్ మార్కెట్ల కోసం రూ.500 కోట్లు
  • ప‌ట్ట‌ణాల్లో వైకుంఠ‌ధామాల నిర్మాణం కోసం: రూ.200 కోట్లు
  • రీజినల్ రింగ్ రోడ్ భూసేకరణ కోసం రూ.750 కోట్లు
  • ప‌రిశ్ర‌మ‌ల రాయితీ కోసం రూ. 2,500 కోట్లు

హైద‌రాబాద్ న‌గ‌ర అభివృద్ధి:

  • ఉచిత మంచినీటి స‌ర‌ఫ‌రా కోసం రూ.250 కోట్లు
  • నాగార్జున సాగర్ సమీపంలోని సుంకిశాల నుంచి హైదరాబాద్ కు నీటిని తరలించడానికి కొత్త ప్రాజెక్టు కోసం రూ.1450 కోట్లు అంచనా ఉండగా ఈ బడ్జెట్ లో రూ.725 కోట్లు కేటాయింపు.
  • మూసీ న‌ది పున‌రుజ్జీవం కోసం, సుంద‌రీక‌ర‌ణ కోసం రూ.200 కోట్లు
  • మెట్రోరైల్ ప్రాజెక్టు కోసం రూ.1000 కోట్లు
  • ఔటర్ రింగ్ రోడ్(ఓఆర్ఆర్) ప‌రిధి లోప‌ల కొత్త‌గా ఏర్ప‌డిన కాల‌నీల తాగునీటి స‌ర‌ఫరా కోసం రూ.250 కోట్లు

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × three =