తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం.. గవర్నర్‌ తమిళిసై కీలక ప్రసంగం

Telangana Assembly Budget Session-2023 Governor Tamilsai Soundararajan Addressed Both The Houses on First Day,Governor Tamilisai Soundararajan Address,Telangana Assembly Budget Session,Telangana Govt Budget,Telangana Budget 2023 On Feb 3 Or Feb 5,Telangana Budget 2023,Mango News,Mango News Telugu,Telangana Budget Wikipedia,Telangana Budget 2023 24,Telangana Budget 2023,Telangana Education Budget,Telangana Budget Date,Andhra Pradesh Budget,Telangana Budget 2022 Pdf,Telangana Budget 2023-24,Telangana Govt Budget 2020-21,Budget Of Telangana 2023,Structure Of Government Budget

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై రాష్ట్ర స్థితి, గతులు.. సాధించిన విజయాలు, దీర్ఘకాలిక ప్రణాళికలపై కీలక ప్రసంగం చేశారు. కాగా గవర్నర్‌ ప్రసంగం అనంతరం శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన వేర్వేరుగా సభా నిర్వహణ సలహా కమిటీ (బీఏసీ) సమావేశాలు నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహించే రోజులు, సభలో ప్రవేశపెట్టే కీలక బిల్లులకు సంబంధించిన అంశాలపై ఈ బీఏసీ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఇక ఈ సమావేశాల్లో భాగంగా ఈ నెల 6వ తేదీన (సోమవారం) 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

గవర్నర్‌ తమిళిసై ప్రసంగం లోని కొన్ని ముఖ్యమైన అంశాలు..

  • తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న సమ్మిళిత సమగ్రాభివృద్ధి యావత్‌ దేశానికి ఆదర్శప్రాయంగా నిలుస్తోంది.
  • ప్రతి రంగంలోనూ దేశం ఆశ్చర్యపోయే విధంగా రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని ఆవిష్కరిస్తూ పురోగమిస్తోంది.
  • ప్రజల ఆశీస్సులు, సీఎం కేసీఆర్‌ పరిపాలనా దక్షత వల్ల తెలంగాణ అపూర్వ విజయాలు సాధించింది.
  • ఒకప్పుడు కరెంటు కోతలతో సతమమైన తెలంగాణ.. ప్రభుత్వ అవిరళ కృషితో నేడు 24 గంటల విద్యుత్‌ సరఫరా చేయగలుగుతోంది.
  • ఒకప్పుడు నష్టాల బాటలో ఉన్న వ్యవసాయ రంగం నేడు దేశానికే అన్నం పెట్టే స్థాయికి చేరుకుంది.
  • 100 శాతం గ్రామాల్లో ఇంటింటికీ ఉచితంగా స్వచ్ఛమైన, సురక్షితమైన త్రాగు నీటిని సరఫరా చేయగలుగుతోంది.
  • పెట్టుబడులకు స్వర్గధామంగా, ప్రపంచ స్థాయి సంస్థలకు గమ్యస్థానంగా, ఐటీ రంగంలో మేటి రాష్ట్రంగా ఎదిగింది.
  • 2014-15లో రూ.62,000 కోట్లుగా ఉన్న తెలంగాణ ఆదాయం.. ప్రభుత్వ కృషి వలన 2021 నాటికి రూ.1,84,000 కోట్లకు పెరిగింది.
  • అలాగే తెలంగాణ ఏర్పడే సమయానికి రూ.లక్షా 24 వేలుగా ఉన్న తలసరి ఆదాయం, 2022-23 నాటికి రూ.3.17 లక్షలకు చేరింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here