కొత్త రెవెన్యూ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం

New Revenue Bill, New Revenue Bill 2020, Revenue Bill, Revenue Bill 2020, telangana, Telangana Assembly, Telangana Assembly Approves New Revenue Bill, Telangana Assembly Revenue Bill, Telangana Assembly Session, Telangana Assembly Unanimously Approves New Revenue Bill, Telangana Revenue Bill

తెలంగాణ శాసనసభ ఐదో రోజు సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ బిల్లుపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అనంతరం నూతన రెవెన్యూ బిల్లుకు శాస‌న‌స‌భ ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ రోజే ఉదయమే రెవెన్యూ బిల్లుపై సభలో చర్చ మొదలయింది. టిఆర్ఎస్ సభ్యులు ఈ బిల్లు వలన రైతులకు కలిగే లాభాలు, రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థలో చోటు చేసుకునే మార్పులను వివరించారు. ఇక కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీ ఎమ్మెల్యేలు ఈ బిల్లుపై మాట్లాడుతూ సలహాలు, సూచనలు చేయడంతో పాటుగా కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. స‌భ్యులు లేవనెత్తిన పలు ప్ర‌శ్న‌ల‌తో పాటుగా, బిల్లులోని కీలక అంశాలపై సీఎం కేసీఆర్ పూర్తిస్థాయి వివ‌ర‌ణ ఇచ్చారు. అనంతరం రెవెన్యూ బిల్లుకు చెందిన భూమిపై హక్కులు, పాస్‌పుస్తకాల బిల్లు-2020, గ్రామ రెవెన్యూ అధికారుల రద్దు బిల్లు-2020 లను ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు శాసన స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. అలాగే సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =