తెలంగాణలో బ్యాంకుల పని వేళల్లో మార్పులు

Banks to run from 8am to noon, Banks to run from 8am to noon in Telangana, Mango News, telangana, Telangana Banks Change Working Hours, Telangana Banks Change Working Hours For Lockdown, Telangana Banks set to curtail business hours, Telangana Banks will Work from 8 AM to 2 PM, Telangana Banks will Work from 8 AM to 2 PM from Tomorrow Onwards, Telangana Lockdown, Telangana Lockdown News, telangana lockdown updates

తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఆంక్షలు సవరించిన నేపథ్యంలో బ్యాంకుల పనివేళలపై రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్‌ఎల్‌బీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే బ్యాంకులు పనిచేస్తుండగా, పనివేళల్లో మళ్ళీ మార్పులు చేశారు. జూన్ 1 నుంచి జూన్ 9 వరకు రాష్ట్రంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకులు పనిచేయనున్నట్టు తెలిపారు. దీంతో రోజూ 6 గంటల పాటు బ్యాంకు సేవలను అందించనున్నారు.

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ ను జూన్ 9 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ నుంచి బ్యాంకులు/ ఏటీఎంలు, బీమా సేవలు మరియు సంబంధిత కార్యకలాపాలకు మినహాయింపు ఇచ్చారు. లాక్‌డౌన్‌ లో భాగంగా ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సడలింపు ఇచ్చారు. సడలింపు సమయం తర్వాత బయటకు వెళ్లిన ప్రజలు ఇళ్లకు చేరేందుకు మరో గంట పాటు అంటే మధ్యాహ్నం 2 గంటల వరకు సమయం ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే బ్యాంకుల పనివేళ్లలో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here