నేషనల్ హెరాల్డ్ కార్యాలయంపై ఈడీ దాడులు.. ఢిల్లీలోని మొత్తం 12 ప్రాంతాల్లో సోదాలు, కీలక పత్రాలు స్వాధీనం

ED Raids on National Herald Office and Other Locations in Delhi After Rahul and Sonia Gandhi Questioning, Raids on National Herald Office and Other Locations in Delhi After Rahul and Sonia Gandhi Questioning, Rahul and Sonia Gandhi Questioning, ED Raids on National Herald Office and Other Locations in Delhi, ED Raids 10 Locations Linked to National Herald Office, National Herald Case, ED Raids Multiple Locations In Delhi After Rahul and Sonia Gandhi Questioning, ED raids Congress owned National Herald office, Congress party owned National Herald newspaper, National Herald newspaper, At least 12 locations were raided by the ED, Congress president Sonia Gandhi and MP Rahul Gandhi, Enforcement Directorate, National Herald Case News, National Herald Case Latest News, National Herald Case Latest Updates, National Herald Case Live Updates, Mango News, Mango News Telugu,

మనీలాండరింగ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో.. ఈడీ మంగళవారం కాంగ్రెస్ పార్టీకి చెందిన నేషనల్ హెరాల్డ్ ప్రధాన కార్యాలయంపై దాడులు నిర్వహించింది. దీనితో పాటు ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లుగా భావిస్తున్న మరో 11 ప్రాంతాలలో కూడా ఈడీ సోదాలు చేపట్టింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ప్రశ్నించిన వారం తర్వాత ఈ చర్యకు దిగింది. సెంట్రల్ ఢిల్లీలోని ఐటీఓ సమీపంలోని బహదూర్ షా జఫర్ మార్గ్‌లోని ‘హెరాల్డ్ హౌస్’ భవనంలో ఉన్న నేషనల్ హెరాల్డ్ కార్యాలయంలో ఫెడరల్ ఏజెన్సీ అధికారులు మంగళవారం సోదాలు చేశారు.

ఈడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కేసులో ప్రమేయం ఉన్న కోల్‌కతాలోని షెల్ (డమ్మీ) కంపెనీ లొకేషన్‌ను కూడా ట్రేస్ చేసి దాడులు నిర్వహించారు. తాజాగా ఈ కేసులో పలువురిని విచారించిన అనంతరం ఈడీకి లభించిన సాక్ష్యాధారాల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు. కాగా మనీలాండరింగ్ విచారణలో భాగంగా ఇప్పటికే సోనియా గాంధీని మూడు రోజుల పాటు 11 గంటలకు పైగా ప్రశ్నించగా, గత నెలలో, రాహుల్ గాంధీని ఐదు రోజుల పాటు విచారించిన ఈడీ 50 గంటలకు పైగా పలు రకాలుగా ప్రశ్నించింది. ఈ క్రమంలో ఇతర కాంగ్రెస్ సీనియర్ రాజకీయ నాయకులు మల్లికార్జున్ ఖర్గే, పవన్ బన్సాల్‌లను కూడా ఏప్రిల్‌లో ఈడీ ప్రశ్నించింది. కాగా నేష‌న‌ల్ హెరాల్డ్ ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసే అవ‌కాశాలున్నట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =