బీజేపీ కీలక నిర్ణయాలు: జూలై 21 నుంచి ‘పల్లె ఘోష’, ఆగస్టు 2 నుండి మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర

Telangana BJP President Bandi Sanjay to Start 3rd Phase Praja Sangrama Yatra from August 2, BJP President Bandi Sanjay to Start 3rd Phase Praja Sangrama Yatra from August 2, Telangana BJP President to Start 3rd Phase Praja Sangrama Yatra from August 2, Bandi Sanjay to Start 3rd Phase Praja Sangrama Yatra from August 2, 3rd Phase Praja Sangrama Yatra from August 2, Praja Sangrama Yatra from August 2, Praja Sangrama Yatra 3rd Phase, Praja Sangrama Yatra-3, Praja Sangrama Yatra, Telangana BJP President Bandi Sanjay, BJP President Bandi Sanjay, Telangana BJP President, Bandi Sanjay Kumar, Praja Sangrama Yatra 3rd Phase News, Praja Sangrama Yatra 3rd Phase Latest News, Praja Sangrama Yatra 3rd Phase Latest Updates, Praja Sangrama Yatra 3rd Phase Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్ర బీజేపీ మరో రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. జూలై 21వ తేదీ నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘పల్లె ఘోష-బీజేపీ భరోసా’ పేరుతో బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు. అలాగే ఆగస్టు 2వ తేదీ నుంచి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ మూడో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఆదివారం నాడు హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కోర్ కమిటీ సమావేశంతో పాటు ప్రజా సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై అధ్యయన కమిటీ సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని బండి సంజయ్‌ తెలిపారు. బండి సంజయ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాలకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, ఇంద్రసేనారెడ్డి, మురళీధర్‌రావు, జి.వివేక్‌ వెంకటస్వామి సహా పలువురు రాష్ట్రస్థాయి పార్టీ నేతలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర, గిరిజనుల పోడు భూముల సమస్య, ధరణి పోర్టల్ లో వైఫల్యాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని బండి సంజయ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జులై 21 నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘ప్రజల పల్లె ఘోష’ పేరుతో బైక్ ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఇక ఆగస్టు 2, 2022 నుండి మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమవుతుందన్నారు. మరోవైపు రాష్ట్రంలో గిరిజన రైతులు ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలని, ధరణి పోర్టల్ లోని లోపాలను సరిదిద్ది రైతులు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వరలక్ష్మి గార్డెన్స్ లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి గిరిజనులకు మద్దతుగా బండి సంజయ్ మౌన దీక్ష నిర్వహిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 5 =