ఈ నెలాఖరుకు పోడు భూముల పంపిణీ ప్రారంభిస్తాం, దళితబంధు తరహాలో గిరిజన బంధు అందిస్తాం – సీఎం కేసీఆర్‌

Telangana Budget Session CM KCR Announces will Start Waste Lands Distribution by Month End After That Girijana Bandhu,Girijana Bandhu Scheme Telangana,Bada Bandi Yojana,Dalitha Bandhu Telangana Scheme News,Mango News,Mango News Telugu,Dalitha Bandhu Telangana Scheme Details ,Dalitha Bandhu Telangana Scheme Updates,Dalitha Bandhu Telangana Scheme Details Apply Online,Dalitha Bandhu Telangana Scheme Apply Online Last Date,Dalitha Bandhu Telangana Eligibility,Dalitha Bandhu Telangana Scheme List,Dalitha Bandhu Telangana Scheme Application Form,Telangana Schemes For Womens,Government Of Telangana Schemes,Kcr Schemes List,Telangana All Schemes List,Telangana Government Schemes,Telangana Govt Schemes List In Telugu,Telangana Policies And Schemes,Telangana Schemes For Women'S,Telangana Schemes List,Telangana Schemes List 2021,Telangana Schemes List 2022,Telangana Schemes List 2022 In Telugu,Telangana Schemes List In Telugu,Telangana Schemes List With Dates,Telangana Schemes Wikipedia

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని గిరిజనులకు ఆయన శుభవార్త చెప్పారు. శుక్రవారం శాసనసభలో సీఎం కేసీఆర్ గిరిజనుల అంశంపై ప్రసంగిస్తూ పలు కీలక విషయాలు వెల్లడించారు. పోడు భూములపై తమ ప్రభుత్వానికి ప్రత్యేక విధానం ఉందని స్పష్టం చేసిన ఆయన ఈ నెలాఖరులో పోడు భూముల పంపిణీ ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇక దాని తర్వాత గిరిజనుల అభ్యున్నతి కోసం దళితబంధు తరహాలో గిరిజన బంధు అందిస్తామని తెలియజేశారు. కాగా పలు కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాల్సిందిగా సీఎం కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టగా.. దీనిని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

శాసనసభలో సీఎం కేసీఆర్ ప్రసంగంలోని కొన్ని కీలక అంశాలు..

  • అటవీ భూములపై ఇప్పటికే నివేదికలు సిద్ధమయ్యాయి, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 66 లక్షల ఎకరాల అటవీ భూములను గుర్తించాం.
  • రాష్ట్రంలోని అన్ని పార్టీల నేతలు ఒప్పుకుంటే దాదాపు 11.5 లక్షల ఎకరాలు పంపిణీ చేస్తాం.
  • ఫారెస్ట్ అధికారులపై దాడులు చేయడం సరికాదు, గుత్తికోయలను తీసుకొచ్చి అడవులను నరికివేయిస్తున్నారు.
  • పోడు భూములు అనేవి ఎప్పటికీ హక్కు కాదు, దురాక్రమణే.
  • అయితే దురదృష్టవశాత్తూ పోడు, అటవీ భూములు కొందరికి ఆటవస్తువులా తయారయ్యాయి.
  • ఖమ్మం జిల్లాలో పలువురు అగ్ర కులాలవారు అటవీ భూములను కబ్జాచేశారు.
  • దీనికోసం వారు గిరిజన యువతులను పెండ్లి చేసుకుంటున్నారని మా దృష్టికి వచ్చింది.
  • గిరిజనుల హక్కులు కాపాడాల్సిందే, అందులో ఎలాంటి సందేహం లేదు.
  • రాష్ట్రంలో పోడుభూముల దురాక్రమణ జరుగుతుండటం ముమ్మాటికీ నిజం.
  • ఇలాగే వదిలేస్తే మిగిలిన అడవులు కూడా నర్సాపూర్‌ అడవిలా ఎడారి మాదిరి తయారవుతాయి.
  • పోడు భూముల సర్వే పూర్తయింది, ఈ నెలాఖరులో ఆ భూముల పంపిణీ ప్రారంభిస్తాం.
  • భూముల పంపిణీ పూర్తయ్యాక రైతుబంధు, విద్యుత్‌, సాగునీటి సౌకర్యం కల్పిస్తాం.
  • ఇప్పటికే సాగు చేసుకుంటున్న వారికి ప్రభుత్వం తరపున పట్టాలు కూడా ఇస్తాం.
  • అయితే భూములు తీసుకున్న గిరిజనులు ఇకపై పోడు భూములను రక్షిస్తామని లిఖితపూర్వక హామీ ఇవ్వాలి.
  • అడవుల్లోని చెట్లు నరకబోమని సంతకాలు పెడితేనే వారికి భూములు పంచుతాం.
  • ఒకసారి భూముల పంపిణీ పూర్తయ్యాక అటవీ ప్రాంతాలను ఆక్రమించడానికి వీల్లేదు.
  • ఒకవేళ చట్టాలను అతిక్రమించి ఇచ్చిన పట్టాలను రద్దు చేస్తాం.
  • భూమిలేని గిరిజనులకు దళితబంధు తరహాలోనే గిరిజన బంధు ఇచ్చి సాయం చేస్తాం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − three =